Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాజకీయ పార్టీలు తమ ప్రభావం చూపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటికే బీజేపీ, సమాజ్ వాదీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు. ఈ నేపథ్యంలో సీ ఓటర్ సర్వే సంస్థ రాష్ర్ట వ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఎక్కువ మంది ఓటర్లు బీజేపీకే మద్దతు పలకడం విశేషం.

యూపీలో ఎక్కువ మంది యోగి ఆదిత్య నాథ్ నే సీఎంగా కోరుకుంటున్నారు. ఆయన పనితనంపైనే ఇష్టం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీనే అధికారం చేజిక్కించుకుంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీలు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు 43 శాతం మంది ప్రజలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీల వైపు ప్రజలు మొగ్గు చూపడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రభావితం చేసేందుకు పలు ఆసక్తికర పథకాలు ప్రకటించినా ఓటర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రియాంక గాంధీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఓటర్లు మద్దతు తెలపడం కష్టమేనని చెబుతున్నారు.
Also Read: అప్పుల కుప్ప: ఏపీ సర్కార్ చేసిన అప్పు ఎంతో తెలుసా?
రాజకీయ పార్టీల్లో విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. అధికార పార్టీ బీజేపీపై ప్రతిపక్షాలు దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అధికారం కోసం తమ విధానాలు మార్చుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీని టార్గెట్ చేసుకుని వాగ్దానాలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తున్నాయి. బీజేపీని అధికారంలోకి రానీయొద్దని శతవిధాలా ప్రయత్నాలు ప్రారంభించాయి.
Also Read: Omicron Variant: ‘ఒమిక్రాన్’ భయం: దేశంలో మళ్లీ లాక్ డౌన్ వస్తుందా?