https://oktelugu.com/

Chandrababu: చంద్రబాబు పరువు ఎవరు తీస్తున్నారు..?

Chandrababu: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు చేసిన హంగామాతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. తన భార్యను అవమానపరిచారని చంద్రబాబు చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో కొందరు ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కుటుంబం ప్రత్యేకంగా మీడియా సమావేశాలు పెట్టి చంద్రబాబు ఏడ్వడానికి కారణమైన వారిపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ సభలో వాస్తవానికి భువనేశ్వరి పేరు ఎవరూ ఎత్తలేదు. కానీ ఆమెను ఉద్దేశించి కొందరు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2021 / 10:08 AM IST
    Follow us on

    Chandrababu: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు చేసిన హంగామాతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. తన భార్యను అవమానపరిచారని చంద్రబాబు చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో కొందరు ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కుటుంబం ప్రత్యేకంగా మీడియా సమావేశాలు పెట్టి చంద్రబాబు ఏడ్వడానికి కారణమైన వారిపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ సభలో వాస్తవానికి భువనేశ్వరి పేరు ఎవరూ ఎత్తలేదు. కానీ ఆమెను ఉద్దేశించి కొందరు వ్యాఖ్యలు చేసినట్లు కొన్ని వీడియోలను చూస్తే తెలుస్తోంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కావనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు వైసీపీలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండాల్సింది.. అన్న చర్చ కూడా నడుస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సంఘటనపై కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు మెప్పు పొందడానికి మరింత రాద్దాంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

    Also Read: ఈసారి చంద్రబాబు ‘సింపతి’ వర్కౌట్ అవుతుందా..?

    chandrababu-radhakrishna-19

    ముఖ్యంగా చంద్రబాబుకు అనుకూలంగా ఎప్పుడూ వార్తలు అందించే రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ వ్యాసంలో అసెంబ్లీ సంఘటనపై ప్రస్తావించారు. సభలో దుశ్వాసన పర్వం, కురుక్షేత్రం, వైసీపీ అంబోతులు అనే పదాలను వాడారు. అంతేకాకుండా సంస్కార హీనులు రాజ్యమేలుతున్నారని అన్నారు. ఈ సంఘటనపై సోషల్ మీడియా సైతం విస్తుపోయిందని రాసుకొచ్చారు. అయితే చంద్రబాబుపై వైసీపీ నాయకులు పరుష వ్యాఖ్యలు చేసినా నేరుగా భువనేశ్వరి పేరు ప్రస్తావించలేదని వారు వాదిస్తున్నారు. అలాంటప్పుడు ఆర్కే తన మీడియాలో భువనేశ్వర్ పేరును పదే పదే ప్రస్తావించడంపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

    ఎన్టీఆర్ కుటుంబం గురించి మాట్లాడుతున్న ఆర్కే ఆ కుటుంబం అంటే చంద్రబాబు, భువనేశ్వరి మాత్రమేనా..? ఇంకెవరు లేరా..? అని కొందరు కౌంటర్ ఇస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావును వాడుకొని వదిలేసినపుడు ఏమైంది..? అని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు అన్యాయం జరిగిందని అంటున్న రాధా కృష్ణ, గతంలో జరిగిన సంఘటనలను కడా ప్రస్తావించి మొత్తంగా అందరిని నిందించాల్సి ఉంది. కానీ కేవలం చంద్రబాబును వెనుకేసుకొచ్చే విధంగా తన వ్యాసం ఉండడంపై కొందరు చర్చలు పెడుతున్నారు.

    జగన్ ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ విషయాలను బయటపెట్టే వరకు ఓకే. కానీ ఎంతో ప్రతిష్టాత్మకం అనుకుంటున్న తన వ్యాసంలో కేవలం చంద్రబాబు మెప్పు పొందే విధంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అంటున్నారు. వాస్తవానికి అసెంబ్లీ హాల్ లో ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన సంఘటన ఇప్పటికీ అందరి మనసులను కలిచివేస్తుంది. అయితే ఇక్కడ చంద్రబాబు ఫ్యామిలీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన వారిని నిందించాల్సి ఉండేది. అంతేకాకుండా కొందరు అలా చేస్తే సభ మొత్తం దుశ్శాసన పర్వం లాంటి పదాలను వాడడంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతోంది.

    ఇక చంద్రబాబు కన్నీళ్లపై ఎన్టీఆర్ కుటుంబం ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. అంతవరకు కామ్ గా ఉంటే సరిపోయేది. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఎంత రాద్దాంతం చేస్తే అంతగా కుటుంబాన్ని రోడ్డున పడేయడం తప్ప పెద్దగా ఒరిగేదేమీ ఉంటుందని కొందరు అంటున్నారు. ఎన్టీఆర్ కుటుంబం మీడియా సమావేశంతో సరిపెట్టుకుంటే ఆర్కే మాత్రం తన మీడియా ద్వారా భువనేశ్వరి పేరును ప్రస్తావించి వ్యాసం రాయడంపై రకరకాలుగా చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా మాధవ రెడ్డి పేరు ఎత్తితే ఎందుకు అంత ఆగ్రహం అన్న అనుమానాలు రేకెత్తించేలా ఆర్కే వ్యాసం సాగినట్లు తెలుస్తోంది. మొత్తంగా చంద్రబాబుకు సానుభూతి తెచ్చేలా ఆర్కే వ్యాసం సాగిందని కొందరు అనుకుంటున్నారు.

    Also Read: మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్య విరమించా.. చంద్రబాబు కన్నీళ్లపై ముద్రగడ పాత పగల కథేంటి?