https://oktelugu.com/

AP Cinema Bill: ఏపీ ప్రభుత్వం తెచ్చిన ‘సినీ చట్టం’లో ఏముంది? సినీ ఇండస్ట్రీకి లాభమా? నష్టమా?

AP Cinema Bill: రాజకీయాలు వేరు.. సినీ ఇండస్ట్రీ వేరు. కానీ రాజకీయాల్లోకి సినీ ప్రముఖులు రావడం.. ఆధిపత్యం చెలాయించడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి మైనస్ అవుతోంది. కొందరు సినీ ప్రముఖుల రాజకీయం ఇప్పుడు మొత్తం సినీ ఇండస్ట్రీని చావుదెబ్బ తీసేలా తయారైంది. అనాదిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకూ టాలీవుడ్ తో అవినాభావ సంబంధం ఉంది. ఇక వైసీపీ పుట్టినప్పటినుంచి చోటా మోటా సినీ ప్రముఖులు తప్పా ఆ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2021 6:11 pm
    Follow us on

    AP Cinema Bill: రాజకీయాలు వేరు.. సినీ ఇండస్ట్రీ వేరు. కానీ రాజకీయాల్లోకి సినీ ప్రముఖులు రావడం.. ఆధిపత్యం చెలాయించడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి మైనస్ అవుతోంది. కొందరు సినీ ప్రముఖుల రాజకీయం ఇప్పుడు మొత్తం సినీ ఇండస్ట్రీని చావుదెబ్బ తీసేలా తయారైంది. అనాదిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకూ టాలీవుడ్ తో అవినాభావ సంబంధం ఉంది. ఇక వైసీపీ పుట్టినప్పటినుంచి చోటా మోటా సినీ ప్రముఖులు తప్పా ఆ పార్టీకి పెద్ద సినీ దిగ్గజాల మద్దతు లేదు. ఇప్పుడు వైసీపీది అధికారం. అందుకే సినీ ఇండస్ట్రీకి చుక్కలు కనిపిస్తున్నాయి. జగన్ చేసిన చట్టం సినీ ఇండస్ట్రీని కూకటివేళ్లతో పెకింలించేలా తయారైంది.

    AP Cinema Bill

    movie tickets

    తాజాగా జగన్ సర్కార్ ‘స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్’ ద్వారా ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లను విక్రయించే కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఈ క్రమంలోనే ఈ బిల్లుపై సినీ ఇండస్ట్రీ ఆందోళన చెందుతోంది. అసలు ఈ బిల్లులో ఏముంది? ఇది ఎవరికి నష్టం? ఎవరికి లాభం? సర్కార్ వాదన సరైందేనా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

    ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చి ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లను విక్రయించే కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఈ చట్టం ప్రకారం ఇక ఏపీలో ఎలాంటి సినిమాలు అయినా సరే.. చిరంజీవి నుంచి మహేష్, పవన్, ఆఖరుకు సంపూర్ణేష్ బాబు లాంటి చిన్న హీరోల సినిమాలకైనా సరే నాలుగు షోలు మాత్రమే వేయాలి. మునుపటిలా బెనిఫిట్, ప్రీ , అడ్వాన్స్, షోలను భారీ టికెట్లు రేట్లు పెట్టి, ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోలు స్పెషల్ ధరకు వేయడానికి వీల్లేదు. బెనిఫిట్ షోలకు అసలు పర్మిషనే లేదు.

    ఆన్ లైన్ ద్వారా మూవీ బుకింగ్ సిస్టమ్ విధానం ద్వారా ప్రభుత్వమే ఇకపై సినిమా టిక్కెట్లను విక్రయించబోతోంది. బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు చెక్ పెట్టబోతోంది. దీనివల్ల చూసే సినీ ప్రేక్షకులకు లాభం. ప్రజలకు మేలు జరుగుతుంది. మెజార్టీ ప్రజల మెప్పును జగన్ సర్కార్ పొందుతుంది.కానీ కలెక్షన్లు రాక.. ఈ చట్టం తెస్తే మాత్రం భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు లాస్ తో అప్పుల పాలు అవ్వడం ఖాయం.

    రాజమౌళి, మహేష్, పవన్ , స్టార్ హీరోలలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ రోజు అధిక ధరలకు టిక్కెట్ విక్రయించడానికి వీలు ఉండదు. దీంతోపాటు ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ పన్ను ఎగవేతను అరికడుతుందని.. గడువులోగా జీఎస్టీని, సేవా పన్నులు మొదలైన వాటిని వసూలు చేయడానికి రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

    ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమ మొత్తం ఐదారుగురు పెద్ద సినిమా నిర్మాతల నియంత్రణలోనే ఉంది. అదొక పెద్ద దందాగా ఉందన్న విమర్శలున్నాయి. దీంతో చిన్న, మధ్యతరహా సినిమాలను వీళ్లు తొక్కేస్తున్నారు. ఇక సినిమా టిక్కెట్లను పెంచి కోట్లు కొల్లగొడుతూ తక్కువ చూపుతూ ప్రభుత్వానికి ఆదాయం రాకుండా కోట్లకు పడగలెత్తుతున్నారు.

    -టికెట్ల కోసం ప్రభుత్వం వెబ్ సైట్, మొబైల్ యాప్ రూపకల్పన

    ఇన్నాళ్లు బుక్ మై షో సహా పలు వెబ్ సైట్లలో టికెట్స్ బుక్ చేసుకునేవారు. ఇక జనం థియేటర్లలో క్యూలో నిలబడి బుక్ చేసుకునే వారు. ఇప్పుడు కష్టాలు తప్పనున్నాయి. ప్రభుత్వ వెబ్ సైట్ కు వెళ్లి బుక్ చేసుకోవడం.. కాల్ చేసి, ఎస్ఎంఎస్ చేసి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఈ టికెట్ రేట్లను, అమ్మకాలను నిర్వహిస్తుంది. ప్రతీరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గేట్ వే ద్వారా థియేటర్లకు డబ్బులు చెల్లిస్తుంది.

    Also Read: సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయం సమంజసమేనా?
    ఈ కొత్త చట్టం వల్ల పన్ను పూర్తి స్థాయిలో చేరి ప్రభుత్వానికి, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరుతుందనేది విశ్లేషకుల మాట. ఇప్పటివరకూ టికెట్ల అమ్మకాలను తక్కువ చూపి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టిన థియేటర్లు, నిర్మాతలకు చెక్ పడనుంది. సినిమా లాభాల్లో పన్నులు కట్ చేసుకొని మిగిలిన డబ్బులు మాత్రమే ఎగ్జిబిటర్స్ ఖాతాల్లో జమ కానున్నాయి.

    దీనివల్ల నిర్మాతలకు.. 50 కోట్లపైన పారితోషికం తీసుకుంటున్న హీరోలకు భారీగా బొక్కపడనుంది. బెనిఫిట్ షోల పేరిట దోపిడీ జరగదు. విడుదలైన రోజు అధిక ధరలు ఉండవు. దీంతో నిజమైన కలెక్షన్లే వస్తాయి. పెంచి చూపించే అవకాశం ఉండదు. నిర్మాతలు కోట్లు పెట్టి తీస్తే దెబ్బతినడం ఖాయం. చిన్న సినిమాలకే దీనివల్ల లాభం.

    Also Read: చిత్రపరిశ్రమ బతకాలంటే సినీ పెద్దలు ఏం చేయాలి?