https://oktelugu.com/

టీవీ 5, ఎన్టీవీ మీడియా వార్.. అసలు కథేంటి?

తెలుగు న్యూస్ చానెల్స్ లో టాప్ 5లో ఉండే ప్రముఖ చానెల్స్ టీవీ5, ఎన్టీవీల మధ్య మీడియా వార్ జర్నలిస్టు సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు చానెల్స్ ఒకరి తప్పులను ఒకరు ఎత్తుచూపుతూ తాజాగా ప్రోమోలు విడుదల చేశాయి. దీంతో వారి పరువును వారే తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు చేసిన అక్రమాలను తవ్వి తీసుకుంటూ ఒకరి భాగోతాన్ని మరొకరు బయటపెట్టుకున్తున్నారన్న  చర్చ సాగుతోంది. *చానెల్స్ మధ్య వివాదమేంటి? తాజాగా టీవీ5లో ‘జూబ్లీహిల్స్ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 20, 2020 / 12:50 PM IST
    Follow us on


    తెలుగు న్యూస్ చానెల్స్ లో టాప్ 5లో ఉండే ప్రముఖ చానెల్స్ టీవీ5, ఎన్టీవీల మధ్య మీడియా వార్ జర్నలిస్టు సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు చానెల్స్ ఒకరి తప్పులను ఒకరు ఎత్తుచూపుతూ తాజాగా ప్రోమోలు విడుదల చేశాయి. దీంతో వారి పరువును వారే తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు చేసిన అక్రమాలను తవ్వి తీసుకుంటూ ఒకరి భాగోతాన్ని మరొకరు బయటపెట్టుకున్తున్నారన్న  చర్చ సాగుతోంది.

    *చానెల్స్ మధ్య వివాదమేంటి?
    తాజాగా టీవీ5లో ‘జూబ్లీహిల్స్ లో భూదందా’ నడిపారని ప్రత్యర్థి టీవీ చానెల్ ఎండీపై ‘అనకొండ’ పేరుతో కథనాలు ప్రసారం చేయడం వివాదానికి కారణమైంది. ఆ తర్వాత జూలు విదిల్చిన ఎన్టీవీ వరుస కథనాలు రాసుకొచ్చింది. టీవీ5 యజమాని గతంలో సొంతంగా హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్, కీళ్ల నొప్పుల ఆయిల్ ను అభివృద్ధి చేసి దానికి విపరీతమైన ప్రచారాన్ని కల్పించి జుట్టు మొలుస్తుందని.. కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్మించి 100 కోట్ల వరకు దండుకున్నాడని ఒక నాయుడు 100 లీలలు అని   ఎన్టీవీ చానెల్ తాజాగా ప్రోమోలు రిలీజ్ చేసి ఆరోపించిన వైనం మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి న్యూజెన్ ఆయిల్ ప్రోడక్ట్ ను టీవీ5 ఒకరిని బెదిరించి లాక్కుందని కథనాల్లో ఆరోపించారు.

    Also Read: కేసీఆర్ పై పోస్టు పెట్టినందుకు యువకుడి అరెస్ట్..! అదే చట్టం ప్రభుత్వానికి వర్తించదా?

    *టీవీ5 వెనుకున్నది ఎవరు?
    టీవీ5 ఫక్తు టీడీపీ అనుకూల చానెల్ గా ఉంది. ఎప్పుడూ టీడీపీని మోసే కథనాలు, వార్తలు వండివారుస్తూ వైసీపీని ఎండగడుతుంది. తాజా వివాదంలో టీవీ5 వెనుకాల చంద్రబాబు, సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేశ్ లు ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ లో జరిగిన రియల్ ఎస్టేట్ దందాలో ఎన్టీవీ యజమాని కోట్లు దండుకున్నాడని ఆరోపిస్తూ కథనాలు రాస్తున్నాయి.

    *ఈ రెండు చానెల్స్ మధ్య జర్నలిస్టులు బలి
    కాగా ఎన్టీవీ, టీవీ5 చానెల్స్ 2014 వరకు బాగానే ఉన్నాయి. చానెల్స్ యజమానులు ఇద్దరూ చంద్రబాబు సామాజికవర్గమే కావడంతో ఆయనకు కాపు కాశాయి. లబ్ధి పొందాయి.అయితే తాజాగా ఎన్టీవీ వైసీపీ అధికారపక్షంలో చేరడం.. వైసీపీకి అనుకూలంగా రాయడంతో టీడీపీ బ్యాచ్ తట్టుకోలేక ఈ వార్ మొదలుపెట్టిందంటున్నారు. వీరిద్దరి మధ్యలో జర్నలిస్టులను బలి చేస్తున్నారు. వీరిద్దరి కోసం ఆధారాలు కూపీలాగుతూ జర్నలిస్టులు టార్గెట్ అవుతున్నారు. రేపు ఈ రెండు చానెల్స్ యజమానులు కలిసినా బలయ్యేది జర్నలిస్టులే..

    *ప్రజాసమస్యలను గాలికి వదిలేసిన చానెల్స్
    ఇప్పుడు కరోనా కబళిస్తోంది. తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. నిర్వాసితుల బాధలు ఘోరంగా ఉన్నాయి. వైద్యసేవలు అథమ స్థాయిలో ఉన్నాయి. అయినా ఇటువంటి ప్రజాసమస్యలు ఏవీ పట్టించుకోకుండా సదురు చానెల్స్ తమ గోతులు తవ్వుకునే కథనాలు వెలువరిస్తూ పరువు తీసుకుంటున్నాయని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. సమాజంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు ఉన్నా కూడా అవేవీ ఈ చానెల్స్ కు పట్టకపోవడంపై జనాలు మండిపడుతున్నారు. జనాలకు సంబంధించిన విషయాల మీద కనీసం కవరేజి ఇవ్వకుండా.. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపకుండా విలువలను ఈ చానెల్స్ పోగొట్టుకుంటున్నాయి. ఎవరి సొంతలాభం… పార్టీల లాభం కోసం ఈ చానెల్స్ దుమ్మెత్తిపోసుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫోర్త్ ఎస్టేట్ కు అర్థం పోగొడుతున్న ఈ చానెల్స్ తీరు అభాసుపాలవుతోంది.

    Also Read: సీఎంపై ఫైరవుతున్న రాములమ్మ.. త్వరలోనే ప్రెస్ మీట్?

    *టీడీపీ, వైసీపీ ఫైట్ లో పావులుగా చానెల్స్
    నిజానికి టీవీ5 ఇప్పుడు టీడీపీ తరుఫున.. ఎన్టీవీ వైసీపీ తరుఫున నిలబడి తమ గోతులు తామే తవ్వుకుంటున్నాయని అంటున్నారు. అధికారం మారడంతో మీడియాల్లో పార్టీలు ఎంట్రీ ఇచ్చి పట్టు సాధించేందుకు చేసే ప్రయత్నాలలో ఎవరికీ వారు తమ ములాలు  పెకిలించుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీలు బాగానే ఉన్నా.. ఈ రెండు చానెల్స్ విశ్వసనీయతకు మాత్రం బొక్కపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.