
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వ్యాక్సిన్ల కొరతతో తంటాలు పడుతున్నారు. ఇతర దేశాల్లో పలు కంపెనీల వ్యాక్సిన్ల వాడకంతో ఎక్కువ మందికి టీకాల వినియోగం జరిగింది. కానీ మన దగ్గర రెండే కంపెనీల టీకాలకే అనుమతులు ఇవ్వడంతో పంపిణీ ఆలస్యం అవుతోంది. కానీ కరోనా జనాన్ని భయపెడుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల ప్రాధాన్యత ఎక్కువైంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును శంకించాల్సి వస్తోంది. ఏపీ సీఎం జగన్ పీఎం మోదీ పై ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నా ఏపీకి మాత్రం ప్రయోజనాలు దక్కడం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు.
జగన్ మాత్రం మోదీకి మద్దుతు ఇస్తున్నా ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అయినా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఫలితంగా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం 18-45 వయసు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ఏప్రిల్ లో నిర్ణయించినా ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. వ్యాక్సిన్ సంస్థలతో మాట్లాడుకుని వ్యాక్సిన్ తెప్పించుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో పడింది. కేంద్రం ఆదుకుంటుందని భావించినా మోదీ మొండిచేయి చూపించడంతో ఏం చేయాలో జగన్ కు పాలుపోవడం లేదు.
ఏపీలో కేసుల సంఖ్య రో జురోజుకు పెరుగుతుండడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడంతో పాలకుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే జగన్ పీకల్లోతు మునిగిపోయారని చెబుతున్నారు. అయినా జగన్ మోదీని ఏం అనడం లేదు. ఆయనకే వంత పాడుతూ భజన చేస్తున్నారు. బీజేపీని తప్పుపట్టేలా మాట్లాడటం లేదు. దీంతో జగన్ భవిష్యత్తుపై నీలినీడలు ఏర్పడనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏపీలో రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అటు కేంద్రం, ఇటు జగన్ ఇద్దరూ పట్టించుకోకపోవడంతో ప్రజల ఇబ్బందులు తొలగడం లేదు. కేసుల సంఖ్య కూడా నానాటికి పెరగడంతో ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.