https://oktelugu.com/

AP Politics: ఏపీలో ఎవరితో పొత్తులు.. ఎవరికి లాభం?

AP Politics: రాబోయే సాధారణ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే  కసరత్తులు మొదలు పెట్టాయి. అధికార వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ పొత్తు దిశగా ఆలోచిస్తున్నాయి.  అయితే ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందా? లేక ద్విముఖ పోటీ ఉంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జనసేన అధినేత పవన్  కల్యాణ్ తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపకుండా బీజేపీకి మద్దతు ఇచ్చాడు.  బీజేపీ అభ్యర్థి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2022 / 03:34 PM IST
    Follow us on

    AP Politics: రాబోయే సాధారణ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే  కసరత్తులు మొదలు పెట్టాయి. అధికార వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ పొత్తు దిశగా ఆలోచిస్తున్నాయి.  అయితే ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందా? లేక ద్విముఖ పోటీ ఉంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

    Chandrababu-Jagan-Pawan-are

    తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జనసేన అధినేత పవన్  కల్యాణ్ తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపకుండా బీజేపీకి మద్దతు ఇచ్చాడు.  బీజేపీ అభ్యర్థి తరఫున క్యాంపెయిన్ చేశాడు. తరువాత జరిగిన ఓ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీజేపీ కే మద్దతు తెలిపారు. ప్రస్తుతం బీజేపీ వెంట ఉన్నట్లుగానే  ఉంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలోనూ పొత్తులు ఉంటాయని పార్టీ శ్రేణులకు సంకేతాలు  ఇచ్చాడు పవన్ కల్యాణ్. బీజేపీతో పొత్తు కొనసాగితే మరే ఇతర పార్టీలతో అలయన్స్ తో ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఉన్నఫలంగా బీజేపీకి ఏపీలో ఒరిగేదేమీ లేదు.

    Also Read: విషాదం: ప్రముఖ తెలుగు నటుడు మృతి !

    జనసేనతో పొత్తు ఉంటే ఎంతో కొంత తమకు లాభిస్తుందని బీజేపీ  భావిస్తున్నది. జనసేన శ్రేణులు మాత్రం ఆందోళనలు చెందుతున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కావాలనే ఇబ్బందులకు గురి చేస్తుందని రేపటి రోజుల్లో అధికార వైసీపీ కార్నర్ చేసే అవకాశం ఉంది. తమ అధినేత సొంత చరిష్మా ఉపయోగపడుతుందనే గంపెడాశలు ఆ పార్టీ శ్రేణుల్లో ఉన్నాయి.  ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు ఎంత వరకు లాభిస్తుందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఈసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే మరో ఆలోచన ఆ పార్టీలో ఉంది. ఒకవేళ టీడీపీతో పొత్తు కుదిరితే తమకు నష్టం తప్పదని భావిస్తున్నాయి. టీడీపీతో అంటకాగే కన్నా బీజేపీయే అన్ని విధాలా మేలని భావిస్తున్నాయి.

    ఇక టీడీపీ కూడా పొత్తు దిశగానే ఆలోచిస్తున్నది. జనసేన తమ వెంట వస్తే అధికార మార్పిడి కచ్చితంగా జరుగుతుందని   టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వసిస్తున్నారు. జనసేన కలిసి రాకుంటే ఓట్లు చీలిపోయి వైసీపీకే లాభిస్తుందని భావిస్తున్నారు.  సీఎం అభ్యర్థి విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గితే జనసేనతో పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయి. అయితే తను లేదా తన కొడుకు లోకేశ్ ను సీఎం కావాలని భావిస్తున్నా పరిస్థితులు అనుకూలించేలా లేవు. జనసేన ఒంటరిగా వెళితే తమ పార్టీకి మరో పదేళ్లు అధికారం కల అని సీబీఎన్ భావిస్తున్నారు. అప్పటి వరకు పార్టీ పరిస్థితి ఏంటని చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. తగ్గాలా, తెగించి పోరాడాలా అనే సందిగ్ధంలో ఉన్నారు.

    ఇక చివరి వరకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా ఫలితం శూన్యం. కాంగ్రెస్ ప్రస్తుతం దిక్కులేని స్థితిలో ఉంది.  ఆ పార్టీకి ఉన్న కేడరంతా  వైసీపీలో చేరిపోయింది. కొంత మంది నేతలు బీజేపీలో చేరారు. కెప్టెన్ లేని నావగా ఆ పార్టీ పరిస్థితి మారిపోయింది.  ఇక కమ్యూనిస్టలు పరిస్థతి సరే సరి. వాళ్లు ఏ ఒక్క పార్టీతోనూ స్థిరంగా ఉండరు. అయితే కాంగ్రెస్ లేదా టీడీపీ అన్నట్లుగానే ఉంటుంది. ఎటోచ్చి టీడీపీకి పొత్తు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అయితే అది జనసేనతో అయితే బాగుంటుందనే అభిప్రాయంలో రెండు పార్టీల్లోనూ ఉంది.

    ఇక ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఎటువంటి పొత్తులు ఉండవని చెబుతున్నారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల కోసం సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక వైసీపీకి పార్టీ పరంగా ఇబ్బందులు ఏమీ లేకపోయినా అధికారమే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.  అధికార పార్టీ నేతల ఆగడాలు ప్రజలకు విసుగు పుట్టిస్తున్నాయి. నవరత్నాలు కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నా మరో చేత్తో అడ్డగోలు రేట్లతో లాక్కుంటున్నారని వ్యతిరేకత మొదలైంది.  ఇక రాష్ట్ర పరిస్థితులను బట్టి పొత్తు అవసరమని చంద్రబాబు బహిరంగంగా అంగీకరించడంతో ఆయన ఒంటరిగా పోటీ చేయడం కల్ల అన్నది స్పష్టమయిపోయింది. టీడీపీ అధినేత సీఎం అభ్యర్థి విషయంలో వెనక్కి తగ్గితే కేంద్రంలో మరోసారి తన పట్టు నిరూపించుకునే అవకాశం ఉంటుంది. పరిస్థితులను బట్టి మరి సీబీఎన్ తన మనసు మార్చుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే..

    Also Read: ఏపీలో పీఆర్సీ వివాదం మళ్లీ రాజుకుందెందుకు..? సమస్య ఎక్కడ వచ్చింది..?