https://oktelugu.com/

ప్రజలకు విలన్ కరోనానా..? పాలకులా..?

భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. కోట్లాది మంది వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. లెక్కనేనంత మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు వైరస్ ఉన్నవాళ్లలో ఎంతమంది ఉంటారో తెలియని భయానక పరిస్థితి. ఈ సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా మా చెవులకేం వినిపించడం లేదన్నట్లుగా ప్రజా పాలకులు కళ్లుమూసుకొని ఉంటున్నారన్న ఆక్రోశం భయటపడుతోంది. మీటింగ్ లు , ప్రకటనల వరకే పరిమితమైన పాలకులు ఒక్కటంటే ఒక్కటీ సరైన, […]

Written By:
  • NARESH
  • , Updated On : May 14, 2021 / 10:48 AM IST
    Follow us on

    భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. కోట్లాది మంది వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. లెక్కనేనంత మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు వైరస్ ఉన్నవాళ్లలో ఎంతమంది ఉంటారో తెలియని భయానక పరిస్థితి. ఈ సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా మా చెవులకేం వినిపించడం లేదన్నట్లుగా ప్రజా పాలకులు కళ్లుమూసుకొని ఉంటున్నారన్న ఆక్రోశం భయటపడుతోంది. మీటింగ్ లు , ప్రకటనల వరకే పరిమితమైన పాలకులు ఒక్కటంటే ఒక్కటీ సరైన, కఠిన నిర్ణయం తీసుకున్న దాఖలాలైతే కనిపించడం లేదు.

    అసలు కరోనా మనుషుల ప్రాణాలు తీస్తుందా..? కరోనా మానవులపై పగబట్టిందా..? అంటే కరోనా వైరస్ మనుషుల్లో చేరుతుంది.. కానీ వారి ప్రాణాలు తీయాలనుకోవడం లేదు. వైరస్ సోకిన వెంటనే సరైన చికిత్స అందించడానికి అందుబాటులో లేని వైద్య సదుపాయాలను కల్పించని పాలకులే ప్రాణాలు తీస్తున్నారని అంటున్నారు. కరోనానే కాదు ఇప్పటికీ ఇతర వ్యాధుల బారిన పడ్డా అవసరమైన వారికి అందుబాటులో వైద్య సదుపాయాలు లేక ఎంతో మంది చనిపోతున్నారు. మరి వైరస్ ప్రాణాలను తీస్తుందా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

    గత సంవత్సం భారత్ లోకి వైరస్ ప్రవేశించినప్పుడు దాదాపు మూడు నెలల పాటు లాక్డౌన్ విధించారు. సామాన్యుడికి లాక్డౌన్ ఎందుకు..? అని డౌట్ వచ్చింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కంటికి కనిపించని వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు దానిని పట్టుకోవడానికి అవసరమైన వైద్య సదుపాయాయాలు కల్పించడానికి కొంత గ్యాప్ అని ప్రకటించారు. మరి లాక్డౌన్ విధించిన సమయంలో సరైన సౌకర్యాలు కల్పించారా..? లేద చప్పట్లు, పళ్లాలతో సౌండ్ చేసుకుంటూ ఉన్నారని కొందరు ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.

    ఇక వ్యాక్సిన్ ప్రారంభం కాగానే మనదేశం ఇతర దేశాల కంటే ఎంతో ముందుకు వెళ్తుందని చెప్పుకున్న పాలకులు ఆ వ్యాక్సిన్లనైనా ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారా..? అంటే అదీ లేదు. కరోనా రోగికి అత్యవసరమైన ఆక్సిజన్ కూడా అందుబాటులో లేని దౌర్భాగ్య దుస్థితిలో ఉంది ఇండియా. ఇక బాధితులకు ఇచ్చే రెమ్ డెసివర్ తో ప్రాణాలు నిలుస్తున్నాయని చాటు మాటుగా అనడంతో దానిని అవసరమైనంత మేరకు ఉత్పత్తి చేసి అందించలేని దుస్థితి నెలకొంది. దీంతో కొందరు ఇదే అదను చూసి వాటిని బ్లాక్ చేసి ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముతున్నారు.

    ఇంత జరుగుతున్నా పాలకులు మాత్రం ఏం చర్యలు తీసుకోదు. ఎందుకంటే వారికి ఎలక్షన్ల టైంకు వచ్చేసరికి అవసరమైన ఓటు బ్యాంక్ ఉంటే చాలు.. ఎవరి ప్రాణాలు ఏమైతే తమకేంటి..? అన్న ధోరణిలో ఉన్నారు. ఇక కొందరు నాయకులైతే తమ దగ్గరి బంధువులకు ప్రభుత్వం నుంచి అవసరమైన సదుపాయాలు అందిస్తూ వారిని కాపాడుకుంటున్నారు. కానీ వారిని ఎన్నుకున్న ప్రజల గురించి మాత్రం ఆలోచించడం లేదు.

    కేంద్రం ఇలా చేస్తుందంటే దానికి రాష్ట్రాలు కూడా వంతు పాడుతూ వస్తున్నాయి. తానా అంటే తందానా అన్నట్లుగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే తాము అలాగే నడుచుకుంటామని అంటున్నారు. మరి తమ రాష్ట్ర ప్రజలకు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనే రావడం లేదా..? అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.