whistling village : మన భారతదేశంలో ఓ గ్రామం గురంచి చర్చ నడుస్తోంది. ఈ గ్రామంలో ఏ వ్యక్తికి పేరు అనేది ఉండదు. పాటలు పాడుతూ ఒకరినొకరు పిలుచుకుంటారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా… కానీ ఇది వాస్తవం. ఇక్కడ బిడ్డ పుట్టినప్పుడల్లా అమ్మ ఒక ట్యూన్ వాయిస్తుంటుంది. అదే ఇకనుంచి ఆ చిన్నారి పేరుగా నిలిచిపోతుంది. అదే ట్యూన్ పాడడం ద్వారా ప్రజలు ఆ చిన్నారిని పిలుస్తారు. భారతదేశంలోని ఈ ప్రత్యేకమైన గ్రామం మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఈ గ్రామం పేరు – కొంగ్‌థాంగ్ గ్రామం. కొంగ్‌థాంగ్ గ్రామంలో ప్రజలు ఒకరినొకరు తమ పేర్లతో కాకుండా స్పెషల్ ట్యూన్ తో పిలుచుకుంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘విజిల్ విలేజ్’ అని కూడా పిలుస్తారు. కాంగ్‌థాంగ్ మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుండి 60 కి.మీ దూరంలో తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు తమ సందేశాలను తమ తోటి గ్రామస్తులకు తెలియజేయడానికి విజిల్ వేయడం ఒక పద్ధతిగా ఉపయోగిస్తారు. కొంగ్‌థాంగ్ గ్రామస్థులు ఈ ట్యూన్‌ని ‘జింగ్‌ర్వాయ్ లాబీ’ అని పిలుస్తారు. అంటే తల్లి ప్రేమ గీతం.
గ్రామస్తులకు రెండు పేర్లు ఉన్నాయి – ఒకటి సాధారణ పేరు, మరొకటి ట్యూన్ పేరు. పాటల పేర్లకు రెండు వెర్షన్లు ఉన్నాయి – లాంగ్ ట్యూన్, షార్ట్ ట్యూన్. సాధారణంగా, షార్ట్ ట్యూన్లను ఇంట్లో, లాంగ్ ట్యూన్లను బయట వ్యక్తులు ఉపయోగిస్తారు. కాంగ్‌థాంగ్‌లో సుమారు 700 మంది గ్రామస్తులు ఉన్నారు మరియు 700 డిఫరెంట్ ట్యూన్లు ఉన్నాయి.
ఖాసీ తెగకు చెందిన వ్యక్తి, కొంగ్‌థాంగ్ గ్రామ నివాసి అయిన ఫివ్‌స్టార్ ఖోంగ్‌సిట్ మీడియాతో మాట్లాడుతూ, ఒక వ్యక్తిని సంబోధించడానికి ఉపయోగించే ‘ట్యూన్’ ప్రసవం తర్వాత తల్లులు కంపోజ్ చేస్తారు.
“గ్రామస్థుడు ఎవరైనా చనిపోతే, అతనితో పాటు అతని రాగం కూడా చనిపోతుంది, మాకు మా స్వంత రాగాలు ఉన్నాయి. అమ్మ ఈ ట్యూన్లను కంపోజ్ చేసింది. మేము రెండు విధాలుగా ట్యూన్లను ఉపయోగించాము – లాంగ్ ట్యూన్, షార్ట్ ట్యూన్. మేము మా ఊరిలోనో లేక ఇంట్లోనో ఈ ట్యూన్లను వాడుతాం. తరం నుండి తరానికి దీనితో గ్రామస్తులు చాలా సంతోషంగా ఉన్నారు” అని ఫివ్‌స్టార్ ఖోంగ్‌సిట్ వివరించారు.
కొంగ్‌థాంగ్ గ్రామానికి చెందిన మరొక స్థానికుడు జిప్సన్ సోఖ్‌లెట్ మాట్లాడుతూ, గ్రామస్తులు ఒకరితో ఒకరు సంభాషించడానికి ట్యూన్‌లు లేదా మెలోడీలను కూడా ఉపయోగిస్తారు.”మా గ్రామంలో సుమారు 700 మంది జనాభా ఉన్నారు, కాబట్టి మా వద్ద దాదాపు 700 రకాల ట్యూన్‌లు ఉన్నాయి. ఈ ట్యూన్‌లు కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగించబడ్డాయి. అసలు పేర్లతో ఎవరినీ పిలవము. మేము పూర్తి పాట లేదా ట్యూన్‌ని ఇతర గ్రామస్థులతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగిస్తాము.ఒక కొత్త బిడ్డ పుట్టినప్పుడు ఒక చిన్న ట్యూన్ ఒక వ్యక్తి చనిపోతే కొత్త ట్యూన్ పుడుతుంది. ఆ పాట లేదా ట్యూన్ మళ్లీ తరతరాలుగా కొనసాగుతోంది. “జిప్సన్ సోఖ్లెట్ చెప్పారు.
ఇప్పుడు మేఘాలయలోని మరికొన్ని గ్రామాల ప్రజలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. గతేడాదిపర్యాటక మంత్రిత్వ శాఖ కాంగ్‌థాంగ్ గ్రామాన్ని UNWTO (ది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ‘ఉత్తమ పర్యాటక గ్రామాలు’ అవార్డుతో పాటు దేశంలోని మరో రెండు గ్రామాలను ఎంపిక చేసింది. 2019లో బీహార్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని, గ్రామానికి యునెస్కో ట్యాగ్‌ని సూచించారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Whistling village in this village no one has names they call each other with songs where is it
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com