Pawan Kalyan: ఏపీలో ప్రస్తుతం రాజకీయ చర్చ వాడి వేడిగా నడుస్తుంది. అధికార వైసిపి పార్టీ విడతల వారీగా తమ అభ్యర్థులను వెల్లడిస్తుంటే టిడిపి జనసేన పొత్తులో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) జనసేన పార్టీకి కేవలం 24 సీట్లు కేటాయించడం పైన ఆ పార్టీ అభ్యర్థుల్లో తీవ్రమైన అసహనం అయితే వ్యక్తం అవుతుంది. ఇక రెండు పార్టీలు రాజకీయ పొత్తు పెట్టుకున్నప్పుడు సీట్లను 50-50 తీసుకోవాలి. కానీ అలా కాకుండా జనసేన కి కేవలం 24 సీట్లు కేటాయించడం అనేది చాలా దారుణమైన విషయమనే చెప్పాలి. దీని మీదనే జనసేన పార్టీ నేతల్లో తీవ్రమైన కలవరమైతే రేగుతుంది…
ఇక దీన్ని బట్టి చూస్తే అసలు పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఆయన స్పీచ్ ల్లో మాట్లాడినంత పౌరుషం ఆయన తీసుకునే నిర్ణయాల్లో ఉండటం లేదు. పార్టీ క్యాడర్ ను పెంచుకోవడం లో పవన్ కళ్యాణ్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 10 సంవత్సరాల క్రితం జనానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీని పెట్టి తన రాజకీయ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. 2014 లో కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ ఒక్కసారి చంద్రబాబు కి సపోర్ట్ చేసి గెలిపించడం లో తప్పు లేదు. కానీ ఇప్పుడు కూడా టిడిపి పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కి ఎందుకు వచ్చింది అని ఆ పార్టీ నేతల్లోనే అసహనం అయితే వ్యక్తం అవుతుంది. మరి ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ కి ఒక గమ్యం అంటూ లేకుండా గాలివాటం లా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇలానే వాళ్ళకి వీళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ వెళ్తే పవన్ కళ్యాణ్ ఇంకో పది సంవత్సరాలు అయిన సీఎం కాలేడు అనేది మాత్రం వాస్తవం. జనసేన పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్లు పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలి అనుకుంటుంటే ఈయన మాత్రం సీఎం ఎవ్వరైనా పర్లేదు అవినీతి అయితే జరగకూడదు అంటున్నాడు. జగన్ మీద కేసు లు ఉన్న మాట వాస్తవమే, అందువల్లే చంద్రబాబు సీఎం అయితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు.వాళ్లే సీఎం లు అయితే నువ్వు సీఎం అయ్యే అవకాశం ఎప్పుడు వస్తుంది. ఎందుకు అంటే 2014లో టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి జనసేన పార్టీ ఎప్పుడూ అధికారంలోకి వస్తుంది అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మిగులుతుంది. పవన్ కళ్యాణ్ అనుకునేది ఏంటంటే జగన్ అవినీతిపరుడు అధికారంలో ఉంటే జనాలని హింసిస్తాడు అనే ఉద్దేశ్యం తో ఆయన్ని గద్దదించాలని చూస్తున్నాడు.
దానికోసమే ఓట్లు చీలిపోకుండా టీడీపీకి మద్దతు ఇస్తున్నాడు. దీనివల్ల పవన్ కళ్యాణ్ కు వచ్చేది ఏమీ లేదు. కానీ టిడిపి పార్టీకి మాత్రం ఇది చాలా ప్లస్ అవుతుంది. నిజానికి ఓట్లు చీలితే చీలనివ్వండి, ఎవరు గెలుస్తారో వాళ్ళని గెలవనివ్వండి. అలాంటప్పుడే జనాలకి నీ వాల్యూ తెలుస్తుంది. అలాగే అభ్యర్థులకు కూడా నీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది.ఇలా వాళ్లకు నువ్వు కావాలి అనుకున్నప్పుడు నువ్వు వద్దన్నా జనాలే నిన్నే ఎన్నుకుంటారు. జనం హితం కోరడం లో తప్పు లేదు. కానీ నీ ఎజెండాను మర్చిపోయి ఒకరి సంకలో చేరడం అనేది ఎప్పటికైనా జనసేన పార్టీకి దెబ్బ పడే అంశం అనే చెప్పాలి. గట్టిగా కొడితే టిడిపి పార్టీ కి చంద్రబాబు నాయుడు ఈ ఒక్కసారి మాత్రమే అధికారం వహిస్తాడు. ఆ తర్వాత టిడిపి పార్టీ ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఎవరో వాళ్ళకి కూడా అర్థం కావడం లేదు. నారా లోకేష్ కొంతవరకు యాక్టివ్ గా ఉన్నప్పటికీ, పార్టీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే కెపాసిటీ అయితే ఆయన దగ్గర లేనట్టుగానే కనిపిస్తుంది.
ఇక అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు సింగల్ గా పోటీ చేస్తే ఎన్నో కొన్ని సీట్లను గెలిచి ప్రతిపక్ష పార్టీ గా అయిన కొనసాగితే బాగుండేది. ఇక ఎలాగూ టిడిపి పార్టీని అంత క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడైతే ఎవరు కనిపించట్లేదు. కాబట్టి వైసిపి అంటే నచ్చని వాళ్ళందరూ జనసేన వైపు మొగ్గు చూపేవారు. దీనివల్ల ఆయన 2029 లో అయిన అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న పనుల వల్ల వాళ్ళ పార్టీ నేతల్లోనే చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఆయన ఏం చేస్తున్నాడో కూడా క్లారిటీ లేకుండా పోతుంది. ఇలా చేస్తే పవన్ కళ్యాణ్ లైఫ్ లో సీఎం అవ్వలేడు అనేది బల్లగుద్ది చెప్పవచ్చు. ఇక 10 సంవత్సరాల సమయంలో 175 నియోజకవర్గాల్లో పార్టీ తరపున నిలబడే అభ్యర్థులను కూడా సంపాదించుకోలేదు అంటే ఆయన రాజకీయ చతురత ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 10 సంవత్సరాల్లో ఏ మాత్రం పార్టీ క్యాడర్ ని పెంచుకొలేని పవన్ కళ్యాణ్ రాజకీయ ఎజెండా ను చూస్తే జాలేస్తుంది.
ఇలా చేస్తే ఆయన ఎప్పటికీ సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ నిజాయితీగా పాలిటిక్స్ చేయాలని అనుకుంటున్నాడు దాంట్లో తప్పు లేదు. కానీ మనం ఎలా అధికారంలోకి రావాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. అలా చేయకపోతే మనం ఎంత నిజాయితీగా ఉన్నా జనాలు మనకి ఓటు వేసే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆయన రాజకీయ ఎజెండాను మార్చుకొని ముందుకు సాగితే బాగుంటుంది. లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా ఎదిగే అవకాశం అయితే ఉండదు…