2024 ఎన్నికల కోసం పవన్ కల్యాణ్ ఇప్పటి నుంచే నజర్ పెట్టాడు. ఈసారి ఎలాగైనా గెలవాలని తహతహలాడుతున్నాడు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి..? ఎక్కడైతే గెలుస్తాం..? అన్న ఆలోచనలో పడ్డాడట. గత 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ ఎక్కడా గెలవ లేకపోయాడు. అయితే ఈసారి కచ్చితంగా గెలిచేందుకు సరైన నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని చూస్తున్నారట. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం కూడా బలంగానే ఉంది. దీంతో ఈ జిల్లాలోని ఓ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని పవన్ కు అభిమానులు సూచిస్తున్నారట.
ప్రస్తతం పవన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొన్నటి వకీల్ సాబ్ సినిమా హిట్టు తరువాత ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కరోనా కారణంగా అవి ఆగిపోయాయి. జూలైలో మళ్లీ షూటింగ్స్ మొదలైనా అవి పూర్తయ్యే సరికి 2023 వరకు పట్టొచ్చు. అయితే మధ్య మధ్యలో పొలిటికల్ పై కూడా దృష్టి పెట్టాలని చూస్తున్నాడట. అయితే గతంలో పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేయాలని పవన్ అభిమానులు సూచిస్తున్నారట. గతంలో ఇక్కడి ప్రజలు పవన్ ను ఓడించినా ఈసారి సింపతిపై గెలిపిస్తారని అంటున్నారు.
ఇక పవన్ ఈసారి ఎంపీగా పోటీ చేస్తాడట. గతంలో రెండు చోట్ల ఎమ్మెల్యేలుగా పోటీ చేసినా పవన్ ఓడిపోయాడు. కానీ ఈసారి ఎంపీగా గెలిచి కేంద్రం అండదండలతో కేబినెట్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని, దీంతో రాష్ట్రంలో సమస్యలపై పోరాడవచ్చని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక రచిస్తున్నారు. ఇక గతంలో ఓడిపోయిన ప్రజలు సింపతిని చూపించి మళ్లీ గెలిపించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పటి నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటే ఫలితం ఉంటుందని కొందరు సీనియర్ నాయకులు పవన్ కు సూచిస్తున్నారట. ఇప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటే వారి మన్ననలను పొందవచ్చని అంటున్నారు.
గాజువాక నియోజవకర్గంలో మొన్నటి వరకు టీడీపీ బలంగా ఉండేది. అయితే ఆ పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు భూ కబ్జా ఆరోపణలతో పాటు సొంత పార్టీలో అసమ్మతితో ఇబ్బందులు పడుతున్నారు. ఇక వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పవన్ కు రాజకీయంగా కూడా కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికల బరిలోకి దిగేసరికి సరైన వ్యహాలు రచించకపోవడంతో ఓడిపోయారని, ఈసారి పక్కా ప్రణాళికతో వెళ్దామని అభిమానులు పవన్ కు సూచిస్తున్నారట.