world`s 10 brands : అమెజాన్ ఆపిల్ ని కొట్టేసింది. ప్రపంచంలోనే తిరుగులేని బ్రాండ్ గా అవతరించింది..299.3 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూ తో నంబర్ వన్ స్థానానికి ఎగిసింది. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా కంపెనీ, దాని వ్యాపారాలు, నికర లాభం, ఉద్యోగులు, నిర్వహిస్తున్న కార్యకలాపాల వంటి అంశాల ఆధారంగా ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో అమెజాన్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత స్థానాన్ని ఆపిల్ ఆక్రమించింది. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా ఆపిల్ నెంబర్ వన్ స్థానంలో ఉండుకుంటూ వస్తోంది.. కానీ తగ్గిన అమ్మకాలు, వ్యాపార విస్తరణలో ఆపిల్ అంతగా చొరవ చూపకపోవడం, చైనా లో అసెంబ్లింగ్ యూనిట్లు మూసివేత కారణంగా ఆపిల్ తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆపిల్ కంపెనీ 297.5 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది.

ఇక గూగుల్ సంస్థ మూడో స్థానంలో నిలిచింది. కంపెనీ విలువ 281.4 బిలియన్ డాలర్లు గా ఉంటుందని బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ అంచనా వేసింది.. మైక్రోసాఫ్ట్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.. ఈ కంపెనీ విలువ 191.4 బిలియన్ డాలర్లుగా ఉంది. వాల్ మార్ట్ ఐదో స్థానంలో నిలువగా … కంపెనీ విలువ 113.8 బిలియన్ డాలర్లు గా ఉంది. సామ్ సంగ్ ఆరో స్థానంలో నిలువగా, కంపెనీ విలువ 99.7 బిలియన్ డాలర్లుగా ఉంది.. ఐసీబీసీ ఏడో స్థానంలో నిలిచింది. కంపెనీ విలువ 69.5 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరిజోన్ ఎనిమిదో స్థానంలో నిలిచింది..కంపెనీ విలువ 67.4 బిలియన్ డాలర్లు గా ఉంది. టెస్లా అయితే 9 స్థానానికి పడి పోయింది. 66.2 బిలియన్ డాలర్లు గా కంపెనీ విలువ ఉంది. ఈ జాబితాలో చైనా కంపెనీ టిక్ టాక్ పదో స్థానం లో నిలిచింది. కంపెనీ విలువ 65.7 బిలియన్ డాలర్లు గా ఉంది.
-ఆమెరికా దే ఆధిపత్యం
ఈ జాబితా లో 7 కంపెనీలు అమెరికా దేశానికి చెందినవే. దక్షిణ కొరియా ఒక కంపెనీ, చైనా నుంచి రెండు కంపెనీలు ఉన్నాయి. ఇక జాబితాలో ఇండియా నుంచి టాటా గ్రూప్ మాత్రమే స్థానం సంపాదించుకుంది. అది కూడా 69వ ర్యాంకులో ఉండటం గమనార్హం. దేశీయంగా పేరు గడించిన రిలయన్స్, అదానీ గ్రూప్ కంపెనీలు ఈ జాబితా లో లేకపోవడం విశేషం. వాస్తవానికి టాప్ టెన్ లో నిలిచిన కంపెనీల ముఖ విలువ గత ఏడాది నుంచి పడిపోవడం మొదలైంది.. లేకుంటే ఆ కంపెనీల బ్రాండ్ విలువ మరింత పెరిగేది. కొవిడ్, ఉక్రెయిన్, రష్యా యుద్ధం, యూరో జోన్ లో అనుశ్చిత పరిస్థితులు కంపెనీల విలువ పడిపోవడానికి కారణమయ్యాయి. ఆర్థిక మాంద్యం పొంచి ఉన్న నేపథ్యంలో మునుముందు ఈ కంపెనీల బ్రాండ్ విలువ మరింత పడిపోతుందని అంతర్జాతీయ వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.