https://oktelugu.com/

AP Ticket Prices: అటు మరీ తక్కువ, ఇటు మరీ ఎక్కువ.. చిన్న సినిమాలకు దారేది ?

AP Ticket Prices: ఏపీలో టికెట్ రేట్లను కావాలని భారీగా తగ్గించిందని సినీ ప్రముఖులు ఆరోణలు చేస్తున్నారు. కొన్ని మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉండే థియేటర్లలో 15 రూపాయలు, 30 రూపాయల రేట్ ని ఖరారు చేసి.. సినిమాలను చంపేస్తున్నారని బాధ పడుతున్నారు నిర్మాతలు. ఇక్కడ నిజంగా బాధ ఎవరికీ ? అందరి కంటే.. థియేటర్ల ఓనర్లుకు, ఇప్పుడు పెట్టిన సినిమా టికెట్ రేట్లకు కరెక్ట్ గా కరెంట్ బిల్ డబ్బులు కూడా రావట్లేదు అని […]

Written By:
  • Shiva
  • , Updated On : December 31, 2021 / 03:59 PM IST
    Follow us on

    AP Ticket Prices: ఏపీలో టికెట్ రేట్లను కావాలని భారీగా తగ్గించిందని సినీ ప్రముఖులు ఆరోణలు చేస్తున్నారు. కొన్ని మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉండే థియేటర్లలో 15 రూపాయలు, 30 రూపాయల రేట్ ని ఖరారు చేసి.. సినిమాలను చంపేస్తున్నారని బాధ పడుతున్నారు నిర్మాతలు. ఇక్కడ నిజంగా బాధ ఎవరికీ ? అందరి కంటే.. థియేటర్ల ఓనర్లుకు, ఇప్పుడు పెట్టిన సినిమా టికెట్ రేట్లకు కరెక్ట్ గా కరెంట్ బిల్ డబ్బులు కూడా రావట్లేదు అని వాళ్లు లబోదిబోమంటున్నారు.

    AP Ticket Prices

    నిజమే.. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ఆంధ్రలో జనానికి సినిమా పిచ్చి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు 200 వరకు పెట్టి సినిమా చూడటం అలవాటు. అలాంటి చోట టికెట్ రేటు తగ్గిస్తే.. కచ్చితంగా సగం కలెక్షన్స్ పడిపోతాయి. అయితే, మరోపక్క తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా 300 రూపాయల వరకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది.

    ఇప్పటికే మల్టిప్లెక్స్ లలో 250 టికెట్ రేటుతో పాటు జీఎస్టీ కూడా తీసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే, ఇక్కడ వచ్చిన మరో సమస్య. ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే ఇక చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా చూడకుండా మల్టిప్లెక్స్ యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేశారు. ఈ రోజు రిలీజ్ అయిన ‘అర్జున ఫల్గుణ’ చిత్రానికి అన్ని మల్టిప్లెక్స్ లలో 295 రూపాయల రేట్ ని నిర్ణయించారు.

    Also Read: ఆ “100 కోట్లు” ఎక్కడున్నాయో చెప్పండంటూ మీడియాకి షాకిచ్చిన రామ్ చరణ్?
    శ్రీవిష్ణు లాంటి హీరో సినిమా ఒక టికెట్ ఖరీదు 295 రూపాయలు అంటే.. మరీ ఎక్కువ. ఎక్కువ రేట్ కాబట్టి.. ఇక ప్రేక్షకులు ఆ సినిమా చూడరు. అలా అని టికెట్ రేట్ పెట్టి కొనే ప్రేక్షకులు చిన్న సినిమాలకు వెళ్ళరు. ఏ హాలీవుడ్ సినిమాకో వాళ్ళు వెళ్తారు. మొత్తమ్మీద తెలంగాణలో ఈ టికెట్ రేటు పెరుగుదల అనేది చిన్న సినిమాలకు పెద్ద గుదిబండ అనుకోవాలి.

    అటు ఆంధ్రాలో టికెట్ మరీ తక్కువ, ఇటు తెలంగాణాలో టికెట్ రేటు మరీ ఎక్కువ.. మొత్తానికి రెండు చోట్ల చిన్న సినిమాలకు లైఫ్ లేకుండా పోయింది.

    ఇప్పుడు చిన్న సినిమాలకు దారేది ?

    Also Read: మూవీ టికెట్స్ ధరలు.. ఏపీలో వాత.. తెలంగాణలో మోత..?

    Tags