ఫామ్‌హౌస్‌ సీఎం ఎక్కడ..?: ఇదే ఇప్పుడు బీజేపీ అస్త్రం

కేసీఆర్‌‌ మొదటి విడత ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే పెద్దగా ఆయన ప్రగతి భవన్‌కు రాలేదు. సెకండ్‌ టైమ్‌ గెలిచిన తర్వాత కూడా అటు వైపు అడుగు పెట్టలేదు. అంతేకాదు.. ఆయన సొంత ఫామ్‌హౌస్‌ నుంచే పాలన సాగిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో అవసరం పడితే కానీ.. ఏదో ముఖ్యమైన సమీక్ష ఉంటే కానీ హైదరాబాద్‌కు రావడం లేదు. అంతేకాదు.. మహనీయుల వర్ధంతి లేదా జయంతి కార్యక్రమాల్లోనూ పెద్దగా పాలు పంచుకోరు. అయితే.. ఇప్పుడు […]

Written By: Srinivas, Updated On : December 24, 2020 3:09 pm
Follow us on


కేసీఆర్‌‌ మొదటి విడత ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే పెద్దగా ఆయన ప్రగతి భవన్‌కు రాలేదు. సెకండ్‌ టైమ్‌ గెలిచిన తర్వాత కూడా అటు వైపు అడుగు పెట్టలేదు. అంతేకాదు.. ఆయన సొంత ఫామ్‌హౌస్‌ నుంచే పాలన సాగిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో అవసరం పడితే కానీ.. ఏదో ముఖ్యమైన సమీక్ష ఉంటే కానీ హైదరాబాద్‌కు రావడం లేదు. అంతేకాదు.. మహనీయుల వర్ధంతి లేదా జయంతి కార్యక్రమాల్లోనూ పెద్దగా పాలు పంచుకోరు. అయితే.. ఇప్పుడు ఇదే అంశాన్ని బీజేపీ తమ అస్త్రంగా మార్చుకోబోతోందట.

Also Read: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఈ సంవత్సరం పాఠశాలలు లేనట్లే..?

వీటిపైనే ఘాటుగా విమర్శలు చేయడం ప్రారంభించారు బీజేపీ నేతలు. గ్రేటర్ ఎన్నికల కోసమే పీవీ జయంతి పేరుతో హడావుడి చేశారని.. ఇప్పుడు ఎన్నికలు అయిపోవడంతో బయటకు రావడం లేదని.. కేసీఆర్ ఎక్కడ ఉన్నారో.. ఎక్కడ పన్నారో తెలియట్లేదని సంజయ్‌ విమర్శించడం ప్రారంభించారు. అటు గ్రేటర్ ఎన్నికల్లోనూ కేసీఆర్ బయటకు రాకపోవడాన్ని రచ్చ చేసింది. హైదరాబాద్‌కు వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు కనీసం కేసీఆర్ పలకరింపులకు రాలేదని కానీ.. ఎన్నికలు రాగానే ఓట్లు కోసం వస్తున్నారని విమర్శలు గుప్పించారు.

అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి కేసీఆర్‌‌ ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రి అని అనడం ప్రారంభించారు. అయితే.. కేసీఆర్ మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. కానీ.. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. బీజేపీ నేతలు పనిచేయని సీఎం అనే ముద్ర వేయడానికి పకడ్బందీ ప్రణాళికలు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ నాలుగు రోజుల క్రితం కేంద్ర మంత్రి గడ్కరీతో జరిగిన ఓ ఆన్‌లైన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. కానీ.. పాల్గొనలేదు.

Also Read: మహానగరానికి మరో ముప్పు..!

మంత్రి ప్రశాంత్ రెడ్డి మాత్రం స్పందిస్తూ కేసీఆర్ అస్వస్థతగా ఉన్నారని.. అందుకే పాల్గొనలేదని వివరణ ఇచ్చారు. వెంటనే గడ్కరీ కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతో కేసీఆర్‌కు ఏమైందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే కేసీఆర్ అనారోగ్య కారణం కేవలం.. ఆ కార్యక్రమాన్ని స్కిప్ చేయడానికేనని కొంత మంది టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గతంలోనూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇలాంటి కారణం చెప్పడంతో అందరూ లైట్ తీసుకున్నారు. ఒక్క సమావేశంలో పాల్గొనకుండా తప్పించుకునేందుకు ఓ ముఖ్యమంత్రిని మరో మంత్రి ఇలా కాపాడుకురావాలా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్