https://oktelugu.com/

అఖిల్ కి అంత సీన్ లేదు… వర్షన్ మార్చిన మోనాల్!

మోనాల్ కి హౌస్ లో మైలేజ్ ఇచ్చిన అంశం అఖిల్ తో లవ్ ఎఫైర్. బిగ్ బాస్ సీజన్ 4కి గానూ బెస్ట్ లవ్ పెయిర్ గా వీరిద్దరూ నిలిచారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేమన్నట్లు హౌస్ లో మెలిగారు. హౌస్ లో ఎక్కువ సమయం వీరిద్దరు మాత్రమే కలిసి గడిపేవారు. ఇక ముద్దులు, హగ్గులు చాలా కామన్ గా జరిగేవి. ఓ సందర్భంలో అఖిల్ మోనాల్ ని నామినేట్ చేయగా… అఖిల్ నా ఫ్యామిలీలా ఫీలయ్యాను, […]

Written By:
  • admin
  • , Updated On : December 24, 2020 / 02:55 PM IST
    Follow us on


    మోనాల్ కి హౌస్ లో మైలేజ్ ఇచ్చిన అంశం అఖిల్ తో లవ్ ఎఫైర్. బిగ్ బాస్ సీజన్ 4కి గానూ బెస్ట్ లవ్ పెయిర్ గా వీరిద్దరూ నిలిచారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేమన్నట్లు హౌస్ లో మెలిగారు. హౌస్ లో ఎక్కువ సమయం వీరిద్దరు మాత్రమే కలిసి గడిపేవారు. ఇక ముద్దులు, హగ్గులు చాలా కామన్ గా జరిగేవి. ఓ సందర్భంలో అఖిల్ మోనాల్ ని నామినేట్ చేయగా… అఖిల్ నా ఫ్యామిలీలా ఫీలయ్యాను, నన్నే నామినేట్ చేస్తే తట్టుకోలేకపోయానని మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కథ అలా ఉంచితే హౌస్ నుండి బయటికి వచ్చిన తరువాత కూడా మోనాల్, అఖిల్ సన్నిహితంగానే ఉంటున్నారని సమాచారం. అలాగే మోనాల్ అతని కోసం ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నారట.

    Also Read: సిద్దార్థ్ ను పెళ్లి చేసుకుంటే నా బ్రతుకు మరో సావిత్రి అయ్యేది!

    తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అఖిల్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యమంలో రిపోర్టర్ మోనాల్ ని ఫోన్ లో అందుబాటులోకి తెచ్చారు. ఇక అఖిల్ గురించి ఆమెను అడుగగా ఎప్పటిలాగే అఖిల్ నంబర్ వన్ అని చెప్పింది. కానీ అఖిల్ మిస్టర్ పర్ఫెక్ట్ మాత్రం కాదని మోనాల్ అన్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ ఎందుకు కాదని రిపోర్టర్ మోనాల్ ని అడుగగా… అమ్మాయిల కోసం పులిహోర కలుపుతాడు.. పెద్ద పులిహోరరాజా అనేసింది లైవ్ లో . అఖిల్ బయటికి వచ్చాక పట్టించుకోవడం లేదని, చాలా బిజీ అయ్యాడు అంది.

    Also Read: ‘రెడ్ ట్రైలర్’ టాక్: డబుల్ రోల్ లో షేక్ చేసిన ‘రామ్’

    అమ్మాయిల్లో అఖిల్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయిందని రిపోర్టర్ మోనాల్ తో అన్నారు. అవును అందుకే అఖిల్ నన్ను పట్టించుకోవడం లేదని అన్నారు. దానికి నువ్వు జెలస్ ఫీలవుతున్నావా? అని రిపోర్టర్ అడుగగా.. అఖిల్ కి అంత సీన్ లేదని చెప్పి నవ్వేసింది. దానికి అఖిల్ నా ఇజ్జత్ తీయకని వేడుకున్నాడు. లైవ్ లో ప్రేమ జంట అఖిల్, మోనాల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు అఖిల్, మోనాల్ పెళ్లి కూడా చేసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. మోనాల్- అఖిల్ ప్రేమ హౌస్ వరకేనా లేక బయట కూడా కొనసాగుతుందా అనేది చూడాలి. గతంలో బిగ్ బాస్ హౌస్ లో మొదలైన ప్రేమ కథలు పెళ్లి అనే తీరం చేరలేదు. దానికి రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మంచి ఉదాహరణ.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్