https://oktelugu.com/

మధుయాష్కి మళ్లీ ఎంట్రీ ఇస్తారా? ఇవ్వరా?

ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన కాంగ్రెస్ నేతల్లో మధుయాష్కి ఒకరు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వద్ద, పార్లమెంటులో తెలంగాణ గళం విన్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వరుసగా రెండుసార్లు వరుసగా విజయం సాధించిన మాధుయాష్కి తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా ఎంపీగా రెండుసార్లు ఓటమిపాలవడం గమనార్హం. 2004, 2009 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన మధుయాష్కి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవితకు కొంత పోటీ ఇచ్చినా ఆమె చేతిలో ఓటమిపాలయ్యారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 7, 2020 / 05:12 PM IST
    Follow us on

    ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన కాంగ్రెస్ నేతల్లో మధుయాష్కి ఒకరు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వద్ద, పార్లమెంటులో తెలంగాణ గళం విన్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వరుసగా రెండుసార్లు వరుసగా విజయం సాధించిన మాధుయాష్కి తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా ఎంపీగా రెండుసార్లు ఓటమిపాలవడం గమనార్హం. 2004, 2009 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన మధుయాష్కి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవితకు కొంత పోటీ ఇచ్చినా ఆమె చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక 2019ఎన్నికల్లో ఏమాత్రం పోటీ ఇవ్వకుండా దారుణ పరాజయం పాలవడంతో నాటి నుంచి ఆయన నియోజకవర్గంలో పత్తాలేకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.

    Also Read: కేసీఆర్.. మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేశాడా?

    ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. ఈ కారణంగానే మధుయాష్కి రెండుసార్లు వరుసగా ఎంపీ అయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన వరుసగా ఓటమి పాలవుతూ వచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందనే సెంటిమెంట్ కాంగ్రెస్ కలిసొస్తుందని అనుకుంటే ఆ ఎన్నికల్లోనూ ఆయన కేసీఆర్ కూతురు కవిత చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ సీటు దక్కించుకున్నప్పటికీ మధుయాష్కి ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వకపోవడం విమర్శలు తావునిచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన కవిత ఓటమే లక్ష్యంగా ఎక్కడ కూడా పెద్దగా ప్రచారం చేయకుండా బీజేపీకి సపోర్టు చేశారనే ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు అరవింద్ కు మద్దతు ఇచ్చారనే వార్తల్లో నిజం లేదని ఆయన గతంలో ఖండించారు.

    అయితే పార్లమెంట్ పరిధిలో ఆయన ఎక్కడా కూడా పెద్దగా ప్రచారం చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో నాడు బరిలో నిలిచిన రైతులందరికీ కలిపి 98వేల ఓట్లు వస్తే యాష్కీకి కేవలం 68 వేల ఓట్లు మాత్రమే వచ్చారు. దీంతో ఆయన డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ ఓటమి తర్వాత ఇప్పటివరకు ఆయన నిజామాబాద్‌లో ఏ కార్యక్రమంలో పెద్దగా పాల్గొనలేదు. కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన ఏ కార్యక్రమంలో ఆయన కన్పించకపోవడంతో మదన్న ఎక్కడా కాంగ్రెస్ కార్యకర్తలే వెతుకుతున్నారట. సంవత్సర కాలంగా ఆయన నియోజకవర్గంలో ఎక్కడా కన్పించకపోవడంతో ఆయన రాజకీయాల్లో మళ్లీ ఎంట్రీ ఇస్తారా? లేదా అనే చర్చ నడుస్తోంది.

    ప్రస్తుతం నిజామాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ చెందిన నేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడం.. ఉన్న నేతలంతా సైలంటవడంతో క్యాడర్ నిస్తేజంగా మారుతోంది. జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని ఆపార్టీ నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు. అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉన్నప్పటికీ ఆయా జిల్లాల నేతలు అడుపదడుప కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాలు చేస్తున్నారు.

    Also Read: హోం ఐసోలేషన్ బాధితుల గోడు పట్టదా?

    కానీ నిజామాబాద్ లో అలాంటి పరిస్థితులు కన్పించకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు భరోసా కల్పించాల్సిన నేతలే పత్తా లేకుండా పోవడం ఏంటనీ నిలదీస్తున్నారు. అయితే మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!