Bipin Rawat: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ బుధవారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తమిళనాడులోని కూనూరు సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. వెల్లింగ్టన్ లోని మిలిటరీ కాలేజీలో ఉపన్యాసం ఇచ్చేందుకు బయలుదేరిన ఆయన గమ్యం చేరకముందే అనంతవాయువుల్లో కలిసిపోయినట్లు తెలుస్తోంది. ఆయన పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేకపోయినా అందరు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ ప్రమాదానికి గురికావడం ఆందోళనకరమే.

బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక రావత్ ఉన్నతాధికారులతో ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు బయలుదేరారు. సూలురు నుంచి హెలిక్యాప్టర్ నుంచి వెళుతుండగా అంతా సవ్యంగా సాగితే ఐదు నిమిషాల్లో ల్యాండ్ అవుతారనే సమయంలో హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. ముందుగా ఓ నలుగురు అందులోనుంచి జారి పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే 13 మంది మృతదేహాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. డీఎన్ఏ ద్వారా మృతులను గుర్తిస్తున్నట్లు చెబుతున్నారు.
హెలికాప్టర్ మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో కట్టేరీలోని సంచప్ప చత్రం ప్రాంతంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. మరో 5 నిమిషాల్లో ల్యాండింగ్ కాబోతుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.. బిపిన్ రావత్ కూడా ప్రమాదంలో మరణించారు.అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలు కొంత ఆలస్యమైనట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు అందరి మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
Also Read: Bipin Rawat: బిపిన్ రావత్ మరణానికి కారణమైన హెలిక్యాప్టర్ కథ ఇదీ
గ్రూప్ కెప్టెన్ మాత్రం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు వాయుసేన ప్రకటించింది. హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంపై అందరు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు నీలగిరి జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. తమిళనాడులోని కూనూరు సమీపంలో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
Also Read: Army Helicopter: బిపిన్ రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశం.. కొనసాగుతున్న ఉత్కంఠ.!