Homeఆంధ్రప్రదేశ్‌AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ఎప్పటికి పూర్తయ్యేనో?

AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ఎప్పటికి పూర్తయ్యేనో?

AP New Districts: వైసీపీ ప్రభుత్వం అన్ని విషయాల్లో గోప్యత పాటిస్తోంది. ప్రజల ముంగిట తేల్చుకోవాల్సిన వాటిని కూడా వారికి తెలియకుండా చేస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందనే విషయాలు ఎవరికి అంతుపట్టడం లేదు. దీంతో రాష్ర్టంలో ఏ పని కూడా ప్రజలకు తెలియకుండా పోతోంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో కూడా వైసీపీ అప్రదిష్ట మూటగట్టుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఉగాది నుంచే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.

AP New Districts
AP New Districts

అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఒకవేళ అధికారికంగా పనులు మొదలుపెడితే వచ్చే విమర్శలపైనే ప్రభుత్వం భయపడుతోంది. నూనత జిల్లాల ఆవిర్భావానికి ప్రభుత్వం నడుంబిగించినా అంతటా అసంతృప్తి జ్వాలలే రగులుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సొంత పార్టీ నేతలే ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వం లెక్కచేయడం లేదు. దీంతో భవిష్యత్ లో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తోందోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి.

Also Read: Somu Veeraju ABN RK: చంద్రబాబును సీఎం చేయడానికా మీ ప్లాన్.. ఏబీఎన్ ఆర్కేకు లైవ్ లో షాకిచ్చిన సోము వీర్రాజు

ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు వచ్చినా ప్రభుత్వం లెక్కచేయడం లేదు. నోటిఫికేషన్ విడుదల చేస్తే ఏర్పడే పరిణామాలపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. అందుకే అధికారికంగా ప్రకటించడం లేదు. ప్రజాభిప్రాయం లెక్కలోకి తీసుకోవడం లేదనే వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ప్రభుత్వం భయాందోళన వ్యక్తం చేస్తోంది. అధికారికంగా ప్రకటిస్తే వచ్చే తిప్పలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు అన్ని సదుపాయాలు లేకున్నా చిన్న చిన్న భవనాల్లో బోర్డులు మాత్రమే ఏర్పాటు చేసి పరిపాలన వ్యవహారాలు కొనసాగించాలని చూస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో ఎలాంటి ఉత్పాతాలు జరుగుతాయో తెలియడం లేదు.

Also Read: AP Food Prices Increased: ఏపీలో ఇక టిఫిన్ చేయలేం.. స్వీట్లు కొనలేం.. కారణమిదీ!

Recommended Video:

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular