RRR Day-3 Collections: విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుతమైన టాక్ తో ఫస్ట్ టు డేస్ కలెక్షన్స్ తో పాటు మూడో రోజు కలెక్షన్స్ విషయంలోనూ అదరగొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ కి సంబంధించి.. బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ విషయంలో దుమ్ము లేపుతుంది. మొత్తం మీద సినిమా మూడో రోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఏరియాల వారీగా కలెక్షన్స్ గమనిస్తే..

నైజాం మూడో రోజు – 15 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 53 కోట్లు.
సీడెడ్ లో మూడో రోజు – 5.6 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 22.5 కోట్లు.
వైజాగ్ లో మూడో రోజు – 4 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 14 కోట్లు.
ఈస్ట్ గోదావరిలో మూడో రోజు – 1.75 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 9 కోట్లు.
వెస్ట్ గోదావరిలో మూడో రోజు – 1.15 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 8 కోట్లు.
కృష్ణలో మూడో రోజు – 2 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 8 కోట్లు.
గుంటూరులో మూడో రోజు – 2 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 11 కోట్లు.
నెల్లూరులో మూడో రోజు – 1 కోటి, మొత్తం మూడు రోజులకు గానూ 4.95 కోట్లు.
Also Read: Naga Shaurya Teaser Talk: టీజర్ టాక్ : ఆకట్టుకున్న “కృష్ణ వ్రింద విహారి టీజర్ !
ఒక తెలుగు సినిమా మూడో రోజు కలెక్షన్స్ లో కూడా ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. హాలీవుడ్ భారీ సినిమాలకు వచ్చిన రేంజ్ లో.. మూడో రోజు కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. ఎలాగూ ఎన్టీఆర్ – చరణ్ పేర్లు వింటేనే చాలు.. ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. అలాంటి హీరోలు కలిసి నటించిన సినిమా అంటే.. అది అమెరికా అయినా, అనకాపల్లి అయినా ఫ్యాన్స్ కు అదో పెద్ద పండుగే.
ప్లేస్ ఎక్కడైనా ఆడియన్స్ ఎవరైనా థియేటర్స్ వద్ద కోలాహలం భారీ స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం అలాగే ఉంది. చాలా మంది ఫస్ట్ టు డేసే కాదు మూడో రోజు కూడా మూవీ చూసేందుకు ఎగబడ్డారు. ఈ సినిమా అద్భుత హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇక ఈ చిత్రానికి తిరుగు లేకుండా పోయింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని తన ప్రభంజనాన్ని సగర్వంగా చాటుకుంది.
Also Read: Andhra Pradesh MP Vs SP: ఏకంగా ఎస్పీ స్థలానికే ఎసరు పెట్టిన ఎంపీ.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో..?
Recommended Video:
[…] […]
[…] […]
[…] Tollywood Best Multi Starrers: టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు ఒకప్పుడు ఎక్కువగా వచ్చేవి. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ తరంలో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇందులో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కొన్ని క్లాసిక్ మూవీలుగా పేరు తెచ్చుకున్నాయి. అయితే స్టార్ హీరోలు మల్టీస్టారర్ చేసి గొప్పగా నటించారు అని పేరు తెచ్చుకోవడంతో పాటు కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. వారి వారి ఫ్యాన్స్ అప్పట్లో నానా రచ్చ చేసేవారు. దీంతో తర్వాతి తరం చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి వారు మల్టీస్టారర్ జోలికి వెళ్లలేదు. […]
[…] Interesting Facts About Oscar Awards: ‘వెండితెర’కు ఆస్కార్ అవార్డ్ ఓ కలల స్వప్నం. ప్రపంచ సినీ లోకంలో ఆస్కార్ ఓ తిరుగులేని రారాజు. అందుకే సినిమా గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ ను అందుకోవాలని, కనీసం ఆస్కార్ కోసం పోటీపడాలని.. ఆ పోటీలో ఆస్కార్ గెలిస్తే, ఇక జీవితం ధన్యమై పోయిందని భావిస్తుంటారు. […]