Chandrababu: చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టేది ఎప్పుడు? ఈరోజుతో కోర్టు షరతులు ముగుస్తాయి. రేపటి నుంచి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. కానీ చంద్రబాబు మదిలో ఏముంది అన్నది తెలియడం లేదు.తెలుగుదేశం పార్టీ నుంచి కూడా స్పష్టమైన ప్రకటన రావడం లేదు. లోకేష్ పాదయాత్ర పునః ప్రారంభించారు. డిసెంబర్ మొదటి వారంలో భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట సంఘీభావ యాత్రలు చేపట్టనున్నారు. చంద్రబాబు విషయం ఏంటన్న దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.బెయిల్ పై విడుదలైన అనంతరం తొలిసారిగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. న్యాయవాది సిద్ధార్థ లూథ్ర ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు.
టిడిపి శ్రేణులు మాత్రం చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారా? ఎప్పుడు వస్తారు? అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. కానీ టిడిపి నాయకత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు. కొద్ది రోజులు ఆగిన తర్వాతే చంద్రబాబు బయటకు వస్తారన్న టాక్ నడుస్తోంది. డిసెంబర్ 3 తరువాత దేశ రాజకీయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆరోజు వెల్లడి కానున్నాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలో హోరాహోరీగా తలపడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇవో సెమీఫైనల్స్ గా భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తే మాత్రం దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగా చంద్రబాబు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది.
మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసుల్లో తీర్పులు పెండింగ్ లో ఉన్నాయి. తనపై నమోదు చేసిన అవినీతి కేసుల్లో నిబంధనలు పాటించలేదని.. ముఖ్యంగా గవర్నర్ అనుమతి తీసుకోకుండా.. ప్రాథమిక ఆధారాలు లేకుండా తనను అరెస్టు చేశారంటూ.. కేసులను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తీర్పు రిజర్వు అయి ఉంది. కొద్ది రోజుల్లో ఆ తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని చంద్రబాబు చాలా ఆశతో ఉన్నారు. ఈ కేసులో తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. తీర్పు వచ్చాక ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి జగన్ సర్కార్ తీరును ఎండగట్టాలని చూస్తున్నారు.
ఈనెల 30న సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై తీర్పు వెల్లడి అవుతుందని ప్రచారం జరుగుతోంది. నేటితో రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఆంక్షలు తొలగుతాయి. దీంతో రేపు తిరుమల వెళ్లి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. 30వ తేదీ నాడు సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వస్తే టిడిపి దూకుడు పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర, మరోవైపు భువనేశ్వరి నిజం గెలవాలి సంఘీభావ యాత్రలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు దుర్గ పర్యటించే అవకాశాలు ఉన్నాయి.