Queen Elizabeth : బ్రిటన్ రాణితో ఫొటో తీయించుకొని.. ఆమె సింప్లిసిటీకి ఇదే మచ్చుతనక

Queen Elizabeth : దేశానికి రాజైనా ఆమె ఒక సాధారణ పౌరురాలిగానే ఉన్నారు. బ్రిటన్ దేశాన్ని ఏడు దశాబ్ధాల పాటు ఏలిన రాణి ఎలిజిబెత్ 2 తుది శ్వాస విడిచారు. కానీ ఆమె గురించిన సంగతులు మాత్రం ఇప్పటికీ ప్రజల మదిలో మెదులుతూనే ఉన్నాయి. రవి అస్తమించని సామ్రాజ్యానికి ఆమె రాణి అయినా కూడా ఆ గర్వం, దర్పం ఉండేది కాదని ఆమె సహాయకులు, పర్సనల్ అధికారులు చెబుతున్నారు. ఒకానొక సమయంలో ఓ అమెరికన్ వ్యక్తులు వచ్చి […]

Written By: NARESH, Updated On : September 9, 2022 2:50 pm
Follow us on

Queen Elizabeth : దేశానికి రాజైనా ఆమె ఒక సాధారణ పౌరురాలిగానే ఉన్నారు. బ్రిటన్ దేశాన్ని ఏడు దశాబ్ధాల పాటు ఏలిన రాణి ఎలిజిబెత్ 2 తుది శ్వాస విడిచారు. కానీ ఆమె గురించిన సంగతులు మాత్రం ఇప్పటికీ ప్రజల మదిలో మెదులుతూనే ఉన్నాయి. రవి అస్తమించని సామ్రాజ్యానికి ఆమె రాణి అయినా కూడా ఆ గర్వం, దర్పం ఉండేది కాదని ఆమె సహాయకులు, పర్సనల్ అధికారులు చెబుతున్నారు.

ఒకానొక సమయంలో ఓ అమెరికన్ వ్యక్తులు వచ్చి రాణి ఎలిజిబెత్ కోసం వెతుకుతున్నారు. ఆమెను ఒకసారి చూసి పోదామని ఆ పరిసరాల్లో పార్క్ లో తిరుగుతున్నారు. అక్కడే ఉన్న రాణి ఎలిజిబెత్ ను కూడా ‘ఇక్కడ రాణిని చూశారా మీరు’ అని ఆమెనే అడిగారు. దానికి తాను చూడలేదని.. అక్కడున్న తన అధికారి చూశాడని చెబుతుంది.

దీంతో అతడిని ‘బ్రిటన్ రాణి ఎలా ఉంటారు?’ అని ఆ అమెరికన్లు ప్రశ్నిస్తారు. దీనికి ఆ అధికారి రాణిని ముందే పెట్టుకొని ఆమెను చూపించకుండా.. ‘ఆమె కొన్ని సమయాల్లో చాలా నిరాడంబరంగా ఉంటారు. అయితే ఆమెకు హాస్యచతురత చాలా ఎక్కువ’ అని అన్నారు.

అనంతరం ఆ అమెరికన్లు ఏకంగా క్వీన్ ఎలిజిబెత్ చేతుల్లో కెమెరా పెట్టి ఆ అధికారితో ఇద్దరూ కలిసి ఫొటో దిగి వెళ్లిపోతారు. అనంతరం రాణి ఎలిజిబెత్ ఎవరో తెలియకుండానే ఆమెతో ఫొటో దిగి వెళ్లిపోతారు.

ఆ తర్వాత రాణి ‘నవ్వుతూ తన ఫొటోలు ఎవరికైనా చూపించాక నేనే రాణిని అని వారికి తెలుస్తుందిలే’ అంటూ తన అధికారితో సరదాగా వ్యాఖ్యానిస్తుంది. అలా రాణిలోని సింప్లిసిటీకి ఇలాంటి ఎన్నో ఘటనలు మచ్చుతునక అని ఆమె సన్నిహితులు అభిప్రాయపడుతుంటారు.