జగన్ బెయిల్ రద్దు కథ ఏం కానుంది?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన బెయిల్ రద్దు పిటిషన్ పై వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అటు జగన్, ఇటు సీబీఐ రెండు వారాలుగా వాయిదాలు వేస్తున్నాయి. దీంతో ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు గడువు ఎందుకు అడుగుతున్నారు. అదీ ఒక్కరు కాకుండా ఇరు పార్టీలు కూడబలుక్కొని చెబుతున్నట్లుగా వాయిదాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసును తప్పు దారి పట్టించే అవకాశాలు ఉన్నాయని పలువురు […]

Written By: Srinivas, Updated On : May 17, 2021 1:52 pm
Follow us on


ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన బెయిల్ రద్దు పిటిషన్ పై వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అటు జగన్, ఇటు సీబీఐ రెండు వారాలుగా వాయిదాలు వేస్తున్నాయి. దీంతో ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు గడువు ఎందుకు అడుగుతున్నారు. అదీ ఒక్కరు కాకుండా ఇరు పార్టీలు కూడబలుక్కొని చెబుతున్నట్లుగా వాయిదాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసును తప్పు దారి పట్టించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే నిజమైతే అసలు రాష్ర్టంలో ఏం జరుగుతుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ప్రధానిని పొగుడుతూ ట్వీట్
గత వారంలో సీబీఐ కౌంటర్ దాఖలు చేసే సమయంలో సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీని విమర్శించిన జార్ఖండ్ సీఎంను విమర్శిస్తూ ట్విటర్లో పోస్టు చేయడంతో సీబీఐ కౌంటర్ దాఖలు ఆగిపోయిందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. మరో వైపు రఘురామ కృష్ణం రాజు తనను అక్రమ కేసులో ఇరికించి జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణపై అందరిలో ఆసక్తి నెలకొంది.

కొత్త సందేహాలు
జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ అదే పనిగా వాయిదాలు అడగడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలనుకుంటే అది ఎంత అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ కేసులో కావాలనే వాయిదాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. కేసును తప్పుదోవ పట్టించడానికే కుట్రలు పన్నుతున్నారనే విషయం స్పష్టం అవుతోంది. ఇన్ని విధాలుగా కేసును వాయిదాలతో తమకు అనుకూలంగా మార్చుకునే పని లో ఉన్నారని తెలుస్తోంది.

అసలేం జరుగుతోంది?
జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణలో ఆలస్యం ఎందుకు జరుగుతుందనే విషయంలో స్పష్టత లేదు. కోర్టు సైతం సీబీఐకి అక్షింతలు వేసింది. ఎందుకు గడువు అడుగుతున్నారని మందలించింది. అయినా వారిలో చలనం లేదు. ఇటు సీబీఐ, అటు జగన్ సంయుక్తంగానే గడువు అడిగేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.