Homeఆంధ్రప్రదేశ్‌TDP: టీడీపి ఆలోచనలు రుద్దేస్తున్నారా?

TDP: టీడీపి ఆలోచనలు రుద్దేస్తున్నారా?

TDP
TDP

TDP: రాష్ట్రంలో ప్రజలు ఎలా బతకాలి అన్నది తెలుగుదేశం పార్టీయే నిర్దేశిస్తుంది.. ఎక్కడ రాజధాని ఉండాలో ఆ పార్టీయే నిర్ణయిస్తుంది.. జనసేన బిజెపి ఎవరితో కలిసి ఉండాలో వాళ్లే డిసైడ్ చేస్తారు.. కాదు కూడదు అంటే మాత్రం దేశద్రోహులు, రాష్ట్ర ద్రోహులుగా ముద్ర వేస్తారు. అన్ని పార్టీల్లోనూ వారికి కావాల్సిన నాయకులు ఉంటారు.. వారు అనుకున్న వాటికి మద్దతు ప్రకటిస్తారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భిన్నమైన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.

రాష్ట్రంలో ఒక చిత్రమైన రాజకీయ పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి చెందిన.. ఒక పార్టీ కనుసన్నల్లో మాత్రమే రాజకీయాలు, ఇతర వ్యవహారాలు నడవాలన్న పద్ధతిలో పరిస్థితులను సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. నువ్వు ఎలా బతకాలి అన్నది నీ ఇష్టం కాదు.. నా ఇష్టం అన్నట్టుగా ఓ వర్గం విపరీత ద్వారా ప్రవర్తిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

రాజధాని నుంచి పార్టీల వరకు..

బెంగళూరు.. హైదరాబాద్ తరహాలో రాజధాని ఉండాలని చెబుతారు.. కానీ 29 గ్రామాల్లోనే ఉండాలని, అది తామే డిసైడ్ చేస్తామన్న భావనను ఆ వర్గం వ్యక్తం చేస్తోంది. అలాగే పలు రాజకీయ పార్టీల విధానాలను వాళ్లే నిర్ణయిస్తున్నారు. జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి.. కానీ తనుగా జనసేన పార్టీ మాత్రం ఎదగకూడదు. టిడిపి తో మాత్రమే కలిసి ఉండాలి. నా ఇష్టం ప్రకారం మాత్రమే జనసేన పార్టీ నడుచుకోవాలి. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానం. అలాగే బిజెపి టిడిపికి అనుకూలంగా ఉండాలి. జగన్కు వ్యతిరేకంగా ఉండాలి. రాష్ట్రంలో బిజెపి సొంతంగా ఎదగకూడదు. ఇది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల శాసిస్తున్న తీరుగానే కనిపిస్తుంది. రాష్ట్రంలోని ప్రజలు గాని, రాజకీయ పార్టీలు గానీ.. తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్నట్టుగానే ఉండాలి.. వారు శాసిస్తేనే ఏదైనా చేయాలి అన్నట్టుగా ఆ వర్గం నేతలు, ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో వ్యక్తులు గాని రాజకీయ పార్టీలు గాని ఎలా ఉండాలో ఎలా ఎదగాలో వాళ్లు మాత్రమే డిసైడ్ చేసే విధంగా పరిస్థితిని సృష్టిస్తున్నారు. తాము చెప్పినట్లుగానే నడవాలి.. లేకపోతే నడిపిస్తాం అటుగా రాష్ట్రంలో పరిస్థితులను మార్చేస్తున్నారు.

ఆ శక్తులతో ముప్పేట దాడికి యత్నం..

తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలోని ముఖ్య నాయకులు అన్నట్లుగా జరగాలి.. లేకపోతే అలా జరిపించే శక్తులను ఉపయోగిస్తారు. అందుకు అవసరమైన మీడియాను, ఆర్థిక శక్తిని, వేధింపులకు గురి చేసే సోషల్ మీడియాను, అన్ని పార్టీల్లోనూ తనకు అనుకూలమైన వ్యక్తులను.. కలిగి ఉండి తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో మాత్రమే ఈ భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. వాళ్లు చేసే ఏ పని అయినా దేశ, జాతి రక్షణగా ప్రచారం చేస్తారు. మిగిలిన వాళ్ళు చేస్తే మాత్రం రాష్ట్ర ద్రోహులు, దేశద్రోహులుగా విమర్శలు గుప్పిస్తారు.

TDP
TDP

ఏం చేసినా మీ బ్రతుకు కోసం అన్నట్టుగా ప్రచారం..

తెలుగుదేశం పార్టీ ఏం చేసినా రాష్ట్ర ప్రజల బ్రతుకు కోసం అన్నట్టుగా ప్రచారాన్ని చేస్తున్నారు. మిగిలిన పార్టీలు ఏం చేసినా ఈ రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు చేసేందుకు అనుగుణంగానే ఉన్నట్టు ప్రచారం చేస్తారు. ఎదుటి వ్యక్తి ఆలోచనలను వీళ్లే డిసైడ్ చేసే విధంగా పరిస్థితులను సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక భిన్నమైన వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టించే ప్రయత్నం జరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళిక ప్రకారమే ఈ విధంగా చేస్తోందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. బ్రిటిష్ పాలనలో ఇటువంటి పరిస్థితి లేదని.. ఇక్కడ పోరాటం చేసేందుకు అవకాశం ఉందని.. ఎక్కడ అటువంటి పరిస్థితిని లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందన్న భావనను నిపుణులు విశ్లేషిస్తుండడం.

RELATED ARTICLES

Most Popular