https://oktelugu.com/

Russia-America: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి అసలు కారణం ఏంటి?

Russia-America : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి మూలం ఏంటి? రష్యా-అమెరికా ఇరు దేశాలు ఎందుకు ఈ వైరాన్ని కొనసాగిస్తున్నాయి. దీని వెనుక చారిత్రక వారసత్వం ఉందా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానం ఉంది. ఈ యుద్ధం కమ్యూనిస్టు రష్యా నుంచి మొదలైంది కాదు. ఇది దశాబ్ధాల నుంచి నడుస్తున్న ఆధిపత్యపోరు. రష్యా జారు చక్రవర్తి అధికారంలోకి వచ్చాక.. మధ్య ఆసియా మొత్తాన్ని కబళించింది. ఆక్రమించింది. ఒకవైపు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ప్రపంచ దేశాలన్నింటిని ఆక్రమిస్తుంటే.. రష్యా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 25, 2022 / 09:53 PM IST
    Follow us on

    Russia-America : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి మూలం ఏంటి? రష్యా-అమెరికా ఇరు దేశాలు ఎందుకు ఈ వైరాన్ని కొనసాగిస్తున్నాయి. దీని వెనుక చారిత్రక వారసత్వం ఉందా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానం ఉంది.

    Russia-America

    ఈ యుద్ధం కమ్యూనిస్టు రష్యా నుంచి మొదలైంది కాదు. ఇది దశాబ్ధాల నుంచి నడుస్తున్న ఆధిపత్యపోరు. రష్యా జారు చక్రవర్తి అధికారంలోకి వచ్చాక.. మధ్య ఆసియా మొత్తాన్ని కబళించింది. ఆక్రమించింది. ఒకవైపు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ప్రపంచ దేశాలన్నింటిని ఆక్రమిస్తుంటే.. రష్యా ఏం తక్కువ తినలేదు.

    ఏ రోజు బ్రిటన్, యూరప్ దేశాలు ప్రపంచాన్ని గుప్పిట పట్టి ఏలినా.. రష్యా వాటికి తలొగ్గలేదు. చరిత్రలో ఇది వాస్తవం. మతపరంగా చూసుకున్నా.. పశ్చిమ యూరప్ లో ఉండేవారు.. రష్యాలో ఉండే వారు వేరు. వారు సపరేట్. జాతి, మత పరంగా చూసుకున్నా పశ్చిమ యూరప్ ఆధిపత్యాన్ని రష్యా ఎప్పుడూ ఒప్పుకోలేదు. చరిత్రలో జార్ చక్రవర్తి టైంలో ఇంగ్లండ్ లో ‘గ్రేట్ గేమ్’గా పిలిచారు.

    రష్యా ఆధిపత్యాన్ని తగ్గించడానికి నాటి ఇంగ్లండ్ ప్రభువులు పర్షియా, భారత్ వరకూ కూడా విస్తరించడానికి పూనుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మీద బ్రిటీష్ వారు దాడిచేయడానికి రష్యా అంటే భయమే కారణం. భారత్ ను ఆక్రమించిన బ్రిటన్ కు రష్యా విస్తరణ భయంతోనే నాడు బ్రిటీష్ వారు ఆప్ఘనిస్తాన్ పై దాడి చేసి ఆక్రమించారు.

    Also Read: ఎన్టీఆర్ ను వాడుకొని చంద్రబాబు-లోకేష్ పై వైసీపీ దాడి?

    భారత్ ను విభజించి.. పాకిస్తాన్ ను ఏర్పాటు చేయడానికి కుట్రపన్నింది బ్రిటీష్ వాళ్లే. రష్యా విస్తరించుకుంటూ వస్తుండడంతో భారత్ తమ చెప్పు చేతుల్లో ఉండదు కాబట్టి నాడు కుట్రపన్ని దేశాన్ని విడగొట్టి పాకిస్తాన్ ను బ్రిటీష్ పాలకులు ఏర్పాటు చేశారు. కీలకమైన ప్రాంతాన్ని తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవాలని నాడు.. మహ్మద్ అలీ జిన్నాతో ఒప్పందం చేసుకొని పాకిస్తాన్ ను సృష్టించిందే బ్రిటీష్.

    బ్రిటీష్ కు రష్యా అంటే ఉన్న భయమే భారత్-పాకిస్తాన్ విడిపోవడానికి కారణం. ఇది బ్రిటన్ ఆడిన గ్రేట్ గేమ్ గా చెప్పొచ్చు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటీష్ బలహీన పడింది. ఆ స్థానాన్ని అమెరికా తీసుకుంది. అమెరికా అగ్రరాజ్యం కొనసాగింది. ఆరోజు నుంచి బ్రిటీష్ వర్సెస్ రష్యాగా ఉన్న వైరం.. అమెరికా-రష్యా మీదకు మళ్లింది. రష్యా-అమెరికా ఆధిపత్య పోరుపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    Also Read: బీజేపీతో ఇక తెగదెంపులేనా..? దూరంగా ఉంటున్న పవన్? కారణం నాగబాబేనా?

    Recommended Video: