Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: ప్ర‌జారాజ్యంలో చేయ‌లేనివి.. జ‌న‌సేన‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేయ‌బోతున్నారు ?

Pawan Kalyan: ప్ర‌జారాజ్యంలో చేయ‌లేనివి.. జ‌న‌సేన‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేయ‌బోతున్నారు ?

Pawan Kalyan: ప్ర‌జారాజ్యం అనుభ‌వాలతో జ‌న‌సేన పాఠాలు నేర్చుకుంటోంది. గ‌తంలో దొర్లిన త‌ప్పుల‌ను పున‌రావృతం కాకుండా చూసుకుంటోంది. 2024 ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన వ్యూహాత్మ‌క అడుగులు వేస్తోంది. గ‌తానికి భిన్నంగా జ‌న‌సేనాని ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్ర‌తి అడుగులోను రాజ‌కీయ ప‌రిణితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

Pawan Kalyan
Pawan Kalyan

2009 ఎన్నిక‌ల్లో తెలుగు రాజ‌కీయ య‌వనిక పై ప్ర‌జారాజ్యం మెరిసింది. తొలిసారిగా ఉమ్మ‌డి ఏపీలో 18 సీట్లు సాధించింది. మూడో ప్ర‌త్యామ్నాయ ఆవ‌శ్య‌క‌త‌ను గుర్తు చేసింది. కాల‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయ‌ల‌కు దూరం జ‌రిగారు. దీంతో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ బాధ్య‌త‌ను నెత్తిన పెట్టుకున్నారు. తెలుగు రాజ‌కీయాల్లో మార్పు రావాల‌ని బ‌లంగా కోరుతున్నారు. జ‌న‌సేన‌తో సాధ్య‌మ‌ని న‌మ్ముతున్నారు.

జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు ఖాయ‌మ‌ని చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. ప్ర‌జారాజ్యం స‌మయంలో జ‌రిగిన త‌ప్పుల‌ను జ‌ర‌గ‌కుండా చూసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పొత్తులో భాగంగా వ‌చ్చే సీట్ల‌లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దింప‌నున్నారు. మొద‌టి నుంచి జ‌న‌సేన‌తో క‌లిసి ప్ర‌యాణం చేస్తున్న నేత‌ల‌కే అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. దాదాపు 9 ఏళ్లుగా జ‌న‌సేన‌తో క‌లిసి ప‌య‌నిస్తున్న నేత‌లు చాలా మంది ఉన్నారు. వారిని గుర్తించి గెలిచే అవ‌కాశం ఉన్న ప్రాంతాల్లో వారికి టికెట్లు ఇవ్వాల‌ని జ‌న‌సేనాని భావిస్తున్నారు.

Pawan Kalyan
Pawan Kalyan

కీల‌క‌మైన కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల పై దృష్టి పెట్ట‌డం ద్వార విజ‌యం సులువుగా మారుతుంద‌ని జ‌న‌సేనాని అంచ‌నా వేస్తున్నారు. ఫ‌లితంగా ప్ర‌భుత్వం ఏర్పాటులో, అధికార భాగ‌స్వామ్యంలో కీల‌క భూమిక పోషించ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. గ‌తానికి భిన్నంగా పూర్తీ రాజ‌కీయ ప‌రిణితితో ప‌వ‌న్ ఆలోచిస్తున్నారు. ఇటీవ‌ల ర‌ణ‌స్థ‌లం వేదిక‌గా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ఆయ‌న రాజ‌కీయ ప‌రిణితికి అద్దం ప‌డుతున్నాయి. త‌న స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ విధానాన్ని ప్ర‌క‌టించారు. అటు శ‌త్రువుల‌కు, ఇటు మిత్రుల‌కు తాను చెప్పాల్సిన అంశాల్ని స్ప‌ష్టంగా చెప్పారు. ఓట‌మితో జ‌న‌సేన ఎన్నో పాఠాలు నేర్చుకుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. గ‌త అనుభ‌వాలు జ‌న‌సేన‌కు గుణ‌పాఠాలుగా మారి, భ‌విష్య‌త్ రాజ‌కీయ ప్ర‌యాణానికి బాట‌లు వేస్తాయ‌ని అంటున్నారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version