https://oktelugu.com/

Pawan Kalyan In AP Politics: ఏపీలో పవన్ కళ్యాణ్ బలం ఎంత?

Pawan Kalyan In AP Politics: సినిమాల్లో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఆయనకు తిరుగే లేదు. కరెక్ట్ సినిమా పడాలే కానీ కలెక్షన్ల సునామీ కురుస్తుంది. తెలుగునాట విపరీతమైన స్టార్ డం ఉన్న నటుడు పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటేనే ఆ  సందడి వేరే లెవల్ లో ఉంటుంది. అయితే సినిమాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన పవన్ రాజకీయంగా మాత్రం పెద్దగా రాణించలేదు. పవన్ ఎప్పుడూ ఒంటరిగా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 22, 2022 / 06:11 PM IST
    Follow us on

    Pawan Kalyan In AP Politics: సినిమాల్లో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఆయనకు తిరుగే లేదు. కరెక్ట్ సినిమా పడాలే కానీ కలెక్షన్ల సునామీ కురుస్తుంది. తెలుగునాట విపరీతమైన స్టార్ డం ఉన్న నటుడు పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటేనే ఆ  సందడి వేరే లెవల్ లో ఉంటుంది. అయితే సినిమాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన పవన్ రాజకీయంగా మాత్రం పెద్దగా రాణించలేదు.

    Pawan Kalyan

    పవన్ ఎప్పుడూ ఒంటరిగా పోటీచేసే సాహసం చేయలేదు. పవన్ తన అభిమానులను నమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చారు. విశేషమైన అభిమాన గణమే తనకు ఓట్ల వర్షం కురిపిస్తుందని నమ్మారు. పైగా రెడ్డి, కమ్మ వర్గాలకు పోటీగా ఏపీలో బలమైన సామాజికవర్గంగా.. గెలుపోటములను నిర్ధేశించే స్తాయిలో ఉన్న కాపుల తరుఫున పోటీచేయడంతో ఆయన ప్రభావం ఉంటుందని అనుకున్నారు. కానీ అది ఏమాత్రం వర్కవుట్ కాలేదు.

    పవన్ కల్యాణ్ రాజకీయాలు తొలి నుంచి ఇతరులపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. అది అభిమానులకు కూడా మింగుడు పడడం లేదు. 2014లో జనసేనను స్థాపించిన పవన్ ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి టీడీపీ-బీజేపీ కూటమికి సపోర్టు చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ మద్దతు వల్లే టీడీపీ విజయం సాధించిందని ఆయన అభిమానులు చెప్పుకుంటారు.

    ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి కమ్యూనిస్టులు, బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు.కానీ పవన్ సైతం రెండు చోట్ల ఓడిపోయి కేవలం ఒకే ఒక్క సీటులో విజయం సాధించారు.

    తత్త్వం బోధపడిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. రానున్న కాలంలో టీడీపీతో జతకట్టే అవకాశాలను కొట్టిపారేయలేని పరిస్థితి. ఒంటరిగా పోటీచేసే సాహసాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చేయలేదు.

    నిజానికి ఒంటరిగా పోటీచేసేంత సత్తా పవన్ కు ఉంది. కానీ జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆయన ఎప్పుడూ కృషి చేయలేదు. పార్టీ పెట్టి ఏడేళ్లవుతున్నా ఇంతవరకూ ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలు లేని పరిస్థితి. పోటీచేయడానికి ఎమ్మెల్యే స్తాయి నేతలు లేకపోవడంతో ఒంటరిగా పోటీచేస్తే పవన్ కు భారీ నష్టం..

    అయితే బలమైన కాపులు ఇప్పటికీ తమకు తాము పార్టీగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదగాలని ఆరాటపడుతున్నారు. వారి వెంట బీసీలు ఇతర సామాజికవర్గాలు కలిసి వస్తాయి. వారందరినీ కలుపుకుంటే పవన్ కళ్యాణ్ నిజంగానే రాజ్యాధికారం దిశగా సాగవచ్చు. మొత్తంగా సొంతంగా పోటీచేసే స్టామినా లేకనే పవన్ కళ్యాణ్ ఇలా పరాయి పార్టీలపై ఆధారపడి పాలిటిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.