AP Govt: ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు వేడుక్కుతున్నాయి. ఎలక్షన్స్‌కు ఇంకా రెండేళ్లకు పైగా టైం ఉండగానే.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు టీడీపీ, వైసీపీలు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాయి. పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీడీపీని ఎలాగైనా బలంగా మార్చాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవలే అసెంబ్లీలోని ఘటన రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అధికార పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ ఘటన విషయాలను వివరిస్తూ మీడియా ముందే చంద్రబాబు కంటతడి పెట్టుకున్నారు. అయితే ఏపీ అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చించడం కంటే చంద్రబాబుపై అధికార పార్టీ లీడర్లు వ్యక్తిగత దూషణలకు దిగడం ఎక్కువవుతోందని జాతీయ మీడియాలో సైతం అనేక కథనాలు వచ్చాయి. దీంతో ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ప్రజల్లో పార్టీ మైలేజ్ పెంచాలని చంద్రబాబు భావిస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక మరో వైపు కేవలం నవరత్నాలపైనే ఫోకస్ పెట్టింది వైసీపీ. మరి వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయా అంటే డౌటే.. దీనికి తోడు రోడ్ల అభివృద్ధి, ఇసుక పాలసీ, పోలవరం, ప్రత్యేక హోదా, రాష్ట్ర రాజధాని వంటి అంశాలు వైసీపీకి సవాల్‌గా మారనున్నాయి. ఇటీవలే మూడు రాజధానులు, మండలి రద్దు విషయంలో జగన్ వెనక్కి తగ్గారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో మండలిలో టీడీపీ సభ్యుల బలం ఎక్కువగా ఉండటంతో మండలిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి జగన్.. ప్రస్తుతం మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరగడంతో ఆ రద్దును విరమించుకున్నారు.
Also Read: జగన్ కు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. చంద్రబాబు భార్య కాళ్లు కన్నీళ్లతో కడుగుతాడట!
ఇలా ప్రతి అంశంలో తన పార్టీకి లాభం చేకూరేలా జగన్ వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు వైసీపీ నేతలు ఇతర పార్టీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతుండటం కూడా పార్టీకి మైనస్‌గా మారుతోంది. మరో వైపు జనసేనతో పొత్తు పెట్టుకుంటే చేకూరే లాభంపై లెక్కలు వేస్తోంది టీడీపీ. 2014 ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కానీ జనసేనకు టీడీపీ నామమాత్రపు సీట్లు కేటాయించింది. అధికారంలోకి వచ్చాక జనసేనను పట్టించుకోవడం తగ్గించేసింది. మరి ఇప్పుడు టీడీపీతో జనసేన జతకడుతుందో లేదో చూడాలి.
ఇక ఏపీలో బలమైన కాపు వర్గం జనసేనకు, కమ్మ వర్గం టీడీపీకి మద్దతు తెలుపుతుండటంతో ఈ వర్గాలు రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక గత రెండున్నరేండ్లుగా ఏపీలో ఏ ఎన్నిక వచ్చినా వరుస విజయాలు సాధిస్తున్న వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడుతుందా అంటే అనేక ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్న పరిస్థితులు లేవు. ఒకవేళ జగన్ ఎలాగైనా గెలిచేందుకు ఇప్పుడున్న పెండింగ్ పనులు పూర్తి చేసి చివరి ఏడాదిలో ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపితే వైసీపీ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. కానీ గతంలో మాదిరిగా భారీ మెజార్టీ వచ్చే అవకాశాలు మాత్రం లేవు.
Also Read: లోకేష్ ను చంద్రబాబే ఓడించారట..?