Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు. జంపు జలానీలు పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటి నుంచే తమకు నచ్చిన పార్టీలో చేరి పదవులు పొందాలని భావిస్తున్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరి తమ పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలకు తెర తీస్తున్నారు. తనతోపాటు వంగవీటి రాధాను కూడా వైసీపీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ఇటీవల చోటుచేసుకుంటున్న పలు ఘటనలు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా విజయవాడలో వల్లభనేని వంశీ వంగవీటి రాధా కలుసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి కలయిక మర్యాదపూర్వకంగానే జరిగినట్లు వార్తలు వస్తున్నా అందులో ఆంతర్యం దాగి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్ది సంవత్సరాలుగా వంగవీటి రంగా వర్ధంతిని ఆయన అభిమానులే జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు వంశీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని అందరిని ఆశ్చర్య పరిచాడు. అయితే అప్పుడే పార్టీ మార్పులపై అందరికి అనుమానాలు వస్తున్నాయి. రాధా పార్టీ మారతారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి వీరిద్దరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే కొడాలి నాని, వంగవీటి రాధా, వల్లభనేని వంశీ మొదటి నుంచి స్నేహితులని వారు ఎక్కడ కలుసుకున్నా ఆత్మీయంగా పలకరించుకుంటారని చెబుతున్నా ఏమో వారి మదిలో ఏముందో ఎవరికి తెలుసు. పైగా ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ పథకంలో భాగంగా పలు పార్టీ లనుంచి నేతలను తమ పార్టీల్లోకి రప్పించేందుకు ఏర్పాట్లు జరుుతున్న నేపథ్యంలో వంగవీటి రాధా, వల్లభనేని వంశీ కలయిక అందరిలో ఆశ్యర్యం కలిగిస్తోంది.