Andhra Pradesh: ఆసియాలోనే అది అతి పెద్ద దియేటర్. అలాగే ప్రపంచంలోనే మూడో అతి పెద్ద థియేటర్ అది. పైగా అతి పెద్ద మల్టిప్లెక్స్ కూడా. అసలు ఇలాంటి మల్టిప్లెక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేటలో ఉండటం గర్వకారణం. కానీ ఇప్పుడు ఆ మల్టిప్లెక్స్ ఇక ఉండదు. ఆగస్టు 30 2019 నాడు సాహో సినిమాతో ఘనంగా ప్రారంభం అయిన ఈ మల్టిప్లెక్స్ నేడు ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ల రేట్ల దెబ్బకు క్లోజ్ అయింది.

జగన్ ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్లకు భారీ మల్టిప్లెక్స్ లను నడపలేమనే నిర్ణయానికి వచ్చి మొత్తానికి మూసేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మల్టిప్లెక్స్ మూసేయడంతో దానిలో పనిచేసే సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారింది. వాళ్ళు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మరి జగన్ ప్రభుత్వం వాళ్లకు ఉద్యోగాలను కల్పిస్తోందా ?
అయినా జగన్ కి కొత్త ఉద్యోగాలు కల్పించడం చేతకాదు కదా. అయితే, ఉద్యోగాలను క్రియేట్ చేయలేకపోయినా ఉన్న ఉద్యోగాలు పీకేయడంలో మాత్రం జగన్ నంబర్ వన్ సీఎంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. మరి తనకున్న పేరు ప్రఖ్యాతలకు తగ్గట్టు జగన్ ముందుకు వెళ్తున్నాడు. సారీ, ముందుకు వెళ్లట్లేదు, దూసుకుపోతున్నాడు.
అన్నట్టు ఈ మల్టిప్లెక్స్ తో పాటు చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను కూడా మూసేస్తున్నారు. ఎలాగూ జగన్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఉల్లఘించకుండా థియటర్స్ నడపలేరు. ఒకవేళ, నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఆ సినిమా థియేటర్లపై అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. కాబట్టి.. ఇక సినిమా థియేటర్స్ ను నడపడం వృధా అని థియేటర్ల యాజమాన్యం కూడా ఫిక్స్ అయిపోయింది.
ఈ నేపథ్యంలోనే థియేటర్లు నడపలేక మూసేస్తున్నారు. అయితే, ఆ థియేటర్స్ లో సిబ్బంది పరిస్థితి ఏమిటి అనేదే ఇప్పుడు ఉన్న అతి పెద్ద సమస్య. అయినా ప్రభుత్వం జాబ్స్ ను ఇవ్వాల్సింది పోయి, ఉన్న జాబ్స్ ను కూడా పీకేస్తుంటే ఇక ఎవరు మాత్రం ఏం చేయగలరు ?