Rise in commodity prices: వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..?అసలేం జరుగుతోంది..?

Rise in commodity prices: కాదేది పెరగడానికి అనర్హం అన్నట్టుగా మారింది.  అగ్గిపుల్ల నుంచి సబ్బు బిల్ల వరకూ..  కూరగాయల నుంచి కార్ల వరకు ప్రతీ వస్తువు ధరలు పెరిగాయి. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నామైంది. దీంతో వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు వస్తువుల ధరలు పెరగడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ద్రవ్యోల్భణం ఏ ఒక్క దేశానికే పరిమితం కాకుండా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. అసలీ ధరలు పెరగడానికి కారణం ఏంటి..? 2008 నుంచి […]

Written By: NARESH, Updated On : January 22, 2022 4:16 pm
Follow us on

Rise in commodity prices: కాదేది పెరగడానికి అనర్హం అన్నట్టుగా మారింది.  అగ్గిపుల్ల నుంచి సబ్బు బిల్ల వరకూ..  కూరగాయల నుంచి కార్ల వరకు ప్రతీ వస్తువు ధరలు పెరిగాయి. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నామైంది. దీంతో వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు వస్తువుల ధరలు పెరగడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ద్రవ్యోల్భణం ఏ ఒక్క దేశానికే పరిమితం కాకుండా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. అసలీ ధరలు పెరగడానికి కారణం ఏంటి..? 2008 నుంచి చూస్తే ఇప్పటి వరకు ఇంతలా ఎందుకు పెరిగాయి..? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..

Rise in commodity prices:

కరోనా కారణంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. లాక్డౌన్ సమయంలో పెట్రోల్ వినియోగం బాగా తగ్గడంతో వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ లాక్డౌన్ తరువాత చమురు వాడకం పెరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చములు అవసరం విపరీతంగా ఏర్పడింది. అమెరికాలో ప్రస్తుతం ఒక గ్యాలన్ గ్యాస్ ధర 3.31 డాలర్లు. భారతీయ లెక్కల ప్రకారం రూ.246. గత సంవత్సరం దీని ధర 2.39 డాలర్లు.. అంటే రూ.177. యూరోపియన్ దేశాలన్నింటిలో ఇదే పరిస్థితి ఉంది. ఇంధన ధరలతో పాటు వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి.

Also Read: పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం.. మంత్రి కొడాలి నానికి బొండా ఉమ సవాల్..

లాక్డౌన్లో ఇళ్లకు పరిమితమైన వినియోగదారులు ఆహార వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఆసియాలో కొవిడ్ నిబంధనల కారణంగా చాలా చోట్ల ఉత్పత్తి సంస్థలు మూసివేశారు. దీంతో వస్తువుల కొరత ఏర్పడి డిమాండ్ పెరిగింది. దీంతో డిమాండ్ కు తగినట్లు వస్తువులు మార్కెట్లోకి రాకపోవడంతో ధరలు పెరిగాయి. ప్లాస్టిక్, కాంక్రీట్, స్టీల్ లాంటి సరుకుల ధరలు కూడా పెరిగాయి. విలాస వస్తువుల ఉత్పత్తి సంస్థలు కూడా మూసివేయాల్సి రావడంతో వాటి ధరలు పెంచాల్సి వచ్చింది. కార్లు, కంప్యూటర్లు ఇతర గృహ అవసరాలకు వినియోగించే వస్తువులు సైతం పెరిగాయి.

ఆసియా నుంచి యూరోప్ కు కంటైనర్ వెళ్లాలంటే గతేడాది 1500 డాలర్లు(లక్షా 11 వేల 682 రూపాయలు) ఉండేది. కానీ ప్రస్తుతం 17000 డాలర్లు (12 లక్షల 65 వేల 735 రూపాయలు) పెరిగింది. మరోవైపు సరుకులను స్టోర్ చేసేందుకు రిటైల్ వ్యాపారులు, అధిక ధరలు పెంచాల్సి వచ్చింది. మొత్తంగా వాటి భారం వినియోగదారులపై పడింది. అలాగే విమాన చార్జీలు కూడా పెరిగాయి. అమెరికాలో రేవులు కిక్కిరిసి పోవడంతో డిసెంబర్లో రవాణా అంతరాయాలు కొంత వరకు సడలిస్తున్నట్లు కనిపించింది.

కొవిడ్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు వదలిపోవడం.. కొత్త ఉద్యోగాల్లో చేరడం వంటివి జరిగాయి. అమెరికాలో ఒక్క ఏప్రిల్లోనే 40 లక్షల మంది ఉద్యోగాలను వదిలిపెట్టినట్లు లేబర్ డిపార్టమెంట్ తెలుపుతుంది. దీంతో సంస్థలు ఉద్యోగులను కాపాడుకునేందుకు, కొత్తవారినినియమించుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎక్కువ వేతనాలు చెల్లించి మరీ ఉద్యోగాలను నియమించుకున్నారు. దీంతో ఆ భారం చివరికి వినియోగదారులపైనే వేశారు.

ఎన్నడూ లేనంతగా గత రెండేళ్లలో వాతావరణంలో అనేక మార్పులు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎక్కువగా కనిపించాయి. ఐడా లాంటి హారికేన్లు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా దాటిన నికోలస్ అమెరికా ఇందన ఇన్ స్ట్రక్టర్ ను దెబ్బతీసి అంతర్జాతీయ ఇందన సరఫరాలపై ప్రభావం చూపించింది. గత వింటర్లో వచ్చిన పెను తుఫాను టెక్సాస్లో అనేక ప్రధాన ఫ్యాక్టరీలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతోమైక్రో చిప్స్ కొతర ఏర్పడింది. ఇవే కాకుండా బ్రెగ్జిట్ తర్వాత అములులోకి వచ్చిన కొత్త వాణిజ్య నిబంధనలు, యూరోపియన్ యూనియన్ నుంచి యూకేకు అయ్యే దిగుమతులు తగ్గాయి. దీంతో యూరోప్ కు వెల్లే యాత్రికులపై తిరిగి రోమింగ్ చార్జీల భారం పడింది. చైనా వస్తువులపై అమెరికా విధించిన దిగుమతి సుంకాలు అధిక ధరల రూపంలో వినియోగదారులపైనే పడింది.

Also Read:ఐపీఎల్ మెగా వేలంలో ఎవరికి ఎంత రేటు? ఎంత మందంటే?