CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ కు తలనొప్పులు మొదలయ్యాయి. సొంత పార్టీలోనే వేరు కుంపట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన తన పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఎప్పుడు జగన్ పర్యటన ఖరారైనా ముందుగానే నిర్ణయిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల అవి రద్దయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇటీవల విశాఖ పర్యటన రద్దు వెనుక పెద్ద బాగోతం దాగి ఉందని పార్టీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వైజాగ్ టూర్ రద్దు వెనుక ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటన రద్దయిందని చెబుతున్నారు.

చివరి నిమిషం వరకు ఆయన పర్యటనపై అధికార యంత్రాంగం పనులు చక్కబెట్టినా చివరి క్షణంల రద్దయిన విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డికి ఉన్న ప్రాధాన్యం గురించి వేరే చెప్పనక్కర్లేదు. రోజురోజుకు ఆయన అనుచరుల సంఖ్య పెరుగుతోంది. ఒక విధంగా ఆయనే సీఎం అనే రేంజ్ లో అక్కడ తన పనులు ఉంటున్నాయి. దీంతో జగన్ ఆందోళన చెందుతున్నారు.
మూడు నెలల క్రితం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా గత జులై నుంచి విజయసాయిరెడ్డి తన ప్రభావం పెంచుకుంటూ పోతున్నారు. దీంతో జగన్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పరిస్థితులు పరిశీలిస్తే విజయసాయిరెడ్డి నెంబర్ టూ అంటూ ఆయన ఎక్కడలేని విధంగా ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఒక దశలో ఉత్తరాంధ్ర సీఎం అంటూ విజయసాయిరెడ్డిని సంబోధిస్తున్నారంటే పరిస్థితి ఎంత వరకు వెళ్లిందో అర్థమవుతోంది. ఇటీవల రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన రద్దయిందని తెలుస్తోంది. ఏదిఏమైనా వైసీపీ లో జరుగుతున్న పరిణామాల క్రమంలో విజయసాయిరెడ్డి వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో వేచి చూడాల్సిందే.