Konda Surekha-Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కొండా సురేఖ మధ్య దూరం పెరిగిపోతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో కొండా సురేఖ పోటీ చేస్తుందని ప్రచారం సాగినా అది సాధ్యం కాలేదు.దీంతో ఇద్దరికి పడటం లేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాల్లో సైతం రేవంత్ పట్టించుకోకపోవడంతో వీరి మధ్య ఇంకా అగాధం పెరిగినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ పీఠం చేపట్టక ముందు కొండా కుటుంబానికి రేవంత్ కు మంచి సంబంధాలు ఉండేవి. రేవంత్ పీసీసీ పీఠం అధిరోహించాక కూడా ఇద్దరి మధ్య సాన్నిహిత్యమే ఉండేది. కాలక్రమంలో వీరి మనస్పర్దలు పెరిగిపోయినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆత్మకూరులో కొండా మురళి తల్లిదండ్రుల విగ్రహాలను కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసినా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కనీసం పరామర్శ కూడా చేయకపోవడంతో సురేఖకు ఆగ్రహం వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి తీరుపై గుస్సా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రవర్తించిన తీరుతో సురేఖ దంపతులు కోపంతో ఉన్నట్లు సమాచారం.
Also Read: బీజేపీపై దాడులు.. ఈ చిన్న లాజిక్ ను టీఆర్ఎస్ ఎందుకు మిస్ అవుతోంది?
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో కూడా ఆ టికెట్ కొండా సురేఖకు ఇస్తున్నట్లు వార్తలు వచ్చినా తరువాత అది ఆచరణలో కనిపించలేదు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ తో పాటు భూపాలపల్లి టికెట్ కూడా తాను కోరిన వారికి ఇవ్వాలని సురేఖ డిమాండ్ చేయడంతో ఆ ప్రయత్నం సఫలం కాలేదని తెలుస్తోంది. దీంతోనే సురేఖ హుజురాబాద్ బరిలో నిలబడలేదని పార్టీ వర్గాల సమాచారం. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం బాగా ముదిరిపోయిందని చెబుతున్నారు.
రాబోయే ఎన్నికల వరకు ఇద్దరి మధ్య సయోధ్య కుదిరి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారో లేక ఇంకా విభేదాలు ముదిరి సంబంధాలు బెడిసికొడతాయో చెప్పలేం. కానీ రాజకీయాల్లో ఒకటి మాత్రం నిజం. శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరనేది తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం అంత సులభం కాదనే విషయం తెలుస్తోంది. సీనియర్లందరు ఏకమైతే తప్ప కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉండదనే విషయం తెలుసుకోవాలి.
[…] […]