https://oktelugu.com/

Telangana BJP: బీజేపీ నేతల పర్యటనల వెనుక ఆంతర్యమేమిటో?

Telangana BJP: తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో లభించిన విజయంతో పార్టీలో నూతనోత్తేజం వస్తోంది. దీంతో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర రెండు దఫాలు నిర్వహించి అధికార పార్టీ టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణను ప్రత్యేకంగా తీసుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టిన బీజేపీ తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని పావులు […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 20, 2022 / 05:34 PM IST
    Follow us on

    Telangana BJP: తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో లభించిన విజయంతో పార్టీలో నూతనోత్తేజం వస్తోంది. దీంతో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర రెండు దఫాలు నిర్వహించి అధికార పార్టీ టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణను ప్రత్యేకంగా తీసుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టిన బీజేపీ తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని పావులు కదుపుతోంది.

    modi-nadda-amit shah

    రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ఢిల్లీ నేతల పర్యటనలు ఖరారు చేస్తున్నారు. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 26న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చి ప్రజల్లో పార్టీకి స్థానం కల్పించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. నేతల పర్యటనలతో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భావిస్తోంది.

    Also Read: CM KCR Delhi Tour: కేసీఆర్‌ చలో ఢిల్లీ.. దేశవ్యాప్త పర్యటనకు ప్రణాళిక.. ఇక జాతీయ రాజకీయాలకే ఫిక్స్‌

    కొద్ది రోజుల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి నేతలు రాష్ట్రానికి రావడం ఎన్నికల వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ఇందుకోసమే వారు పలుమార్లు పర్యటిస్తూ ప్రజల్లో తమ పార్టీపై అభిమానం పెరిగేలా చేసేందుకు దిశా నిర్దేశం చేస్తున్నారు. మహబూబ్ నగర్ లో జేపీ నడ్డా, హైదరాబాద్ లో అమిత్ షా పర్యటించారు. ప్రధాని మోడీ కూడా హైదరాబాద్ బిజినెస్ వార్షికోత్సవానికి హాజరుకానున్నట్లు సమాచారం.

    modi-nadda-amit shah

    మారుతున్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కమలనాథులు పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో పార్టీని బలపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ నాయకుల పర్యటనతో ఈ విషయం స్పష్టమవుతోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి శత విధాలా ప్రయత్నిస్తోంది. నేతల్లో ఉత్సాహం కలిగేలా నేతలు పర్యటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు .దీంతో అప్పుడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో విజయం సాధించింది. ఇప్పుడు కూడా ప్రధాని పర్యటన నేతలకు టానిక్ లా పనిచేస్తుందనే భావం అందరిలో వస్తోంది. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు తలమునకలయ్యారు. ఇది బీజేపీకి మరో మైలేజీ కానుందని విశ్లేషకులు చెబుతున్నారు.

    Also Read:Disha Encounter: దిశ ఎన్‌కౌంటర్‌ బూటకం.. సిర్పూర్కర్‌ కమిషన్‌ సంచలన నివేదిక

    Tags