Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- Modi: మోడీని కలిశాక పవన్ చెప్పిన మాటలకి అర్థమేంటి ?

Pawan Kalyan- Modi: మోడీని కలిశాక పవన్ చెప్పిన మాటలకి అర్థమేంటి ?

Pawan Kalyan- Modi: కొందరికి నేచురల్ పొటెన్షియల్ ఉంటుంది. ఈ రోజుకి నీ దగ్గర ఏముంది … ఏం లేదన్నది పాయింట్ కాదు. అవకాశం నిన్ను వెదుక్కుంటూ వస్తుందంతే ! పవన్ కచ్చితంగా అలాంటి పర్సనాలిటీనే ! ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ పనిగట్టుకొచ్చి మోడీ పిలిచి మాట్లాడ్డానికి కారణం అదే !

Pawan Kalyan- Modi
Pawan Kalyan- Modi

ఎదుటోడు నీకు ఎంతైనా కప్పం కట్టనీ ! ఒదిగి ఒదిగి నీ కాళ్లసందున దూరి ఉండనీ ! కంప్లీట్ నెస్ ఉండదు. కూలుతున్న కోటలో కులాసాగా ఉండాలని సామాన్యుడే కోరుకోడు. ఇక మోడీ ఎందుకు ఊరుకుంటాడు ! ఇప్పుడు అంటకాగుతున్నోడు ఇగోని సంతృప్తి పరుస్తున్నాడేమో కానీ ఫ్యూచర్ లేదు. అందుకే పవన్ కి పిలువు. అవతలున్న టీడీపీతో సంబంధాలు అంతంత మాత్రం కాబట్టి మాట్లాడ్డానికి పవన్ కావల్సొచ్చాడు. ఇంతకీ మాట్లాడిందేంటి ? అందులో నిజమయ్యేది ఎంత ?

అదే పాయింటు. పవన్ కి విశాఖ కార్యక్షేత్రం. పోయిన చోటే వెదిక్కొనే మొండి ఘటం. ఏపీలో కూడా విశాఖ కీలక పాయింటు. రాజకీయానికి అయినా, దోపిడీకి అయినా ! ఇలాంటప్పుడు పవన్ చెప్పే మాటలో నిప్పు కణికకు ఉన్న నిజాయితీ ఉంటుంది. మరి ఆ మాట విన్న వాడిలో పిసరంత అయినా ప్రతిస్పందన ఉంటుందా అనేదే పాయింటు !

Pawan Kalyan- Modi
Pawan Kalyan- Modi

విని స్పందిస్తే మంచిది. స్పందించకపోతే మరీ మంచిది అనే బాపతు పవన్ కల్యాణ్. బీజేపీ, మోడీ రియాక్ట్ అయితే కలిసుంటాడు. లేదంటే, ఛలో అని ముందుకెళతాడు తప్పితే వెనక్కి తగ్గే రకం కాదు. అందుకే, ఏపీ రాజకీయం గురించి – విశాఖ పరిణామాల గురించి ఇక నేను చెప్పాల్సింది చెప్పా, ఇక ఆయనిష్టం అన్నాడు. అంటే స్పందిస్తే ఉంటాడు. స్పందించకపోయినా ఉంటాడు. కాస్త దూరంగా ! అదే తేడా !

దేశపు జెండాకున్నంత పొగరు ఉంది నాకు అని పవన్ ఎందుకు అంటాడో ఇలాంటప్పుడే నడతలో కనిపిస్తుంది. ఈ హోల్ ఎపిసోడ్ లో విండికేట్ అవుతున్నది మోడీ స్టాండే ! దటీజ్ ద బ్యూటీ !

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version