Kanna Lakshminarayana : కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి నిష్క్రమించడం బీజేపీకి నష్టమా? అంటే కాదనే చెప్పాలి. బీజేపీ ఏపీలో ఇంతటి అథమ స్థానంలో ఉండడానికి కన్నానే కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కన్నా పోతే బీజేపీకి తీవ్ర నష్టం అన్నట్టుగా ఫోకస్ చేస్తున్నారు. కానీ ఆ ఇద్దరూ రాసుకుంటే బూడిద రాలినట్టు.. కన్నా వచ్చినా.. పోయినా కూడా బీజేపీకి ఏమాత్రం తేడా లేదన్నది వాస్తవం.
ఏపీలో బీజేపీ పరిస్థితి పూర్తిగా కిందపడి ఉంది. లేచే పరిస్థితిలో లేదు. దీనికి సవాలక్ష కారణాలున్నాయి. కన్నా బీజేపీ నుంచి వైదొలడం ఖచ్చితంగా బీజేపీకి లాభమేనన్న చర్చ సాగుతోంది. బీజేపీ ఏపీలో బలపడకపోవడానికి ప్రధానమైన కారణం.. ఎవరో కాదు.. బీజేపీ కేంద్ర నాయకత్వ వైఖరి. ఏపీకి విభజన హామీలో పెట్టిన హామీలేవి అమలు చేయకపోవడమే బీజేపీ ఈ స్థితికి దిగజారడానికి కారణం.
ఏపీలో కాంగ్రెస్ పై ఎంత వ్యతిరేకత ఉందో.. అంతకుమించిన వ్యతిరేకత బీజేపీ పై ఉంది. ఈ నేపథ్యంలో కన్నా నిష్క్రమణతో ఆంధ్రా బీజేపీకి లాభమా, నష్టమా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..