Forest fires: మనిషి స్వచ్ఛంగా బతకాలంటే స్వచ్ఛమైన వాతావరణం ఉండాలి.. అలాంటి వాతావరణం మనకు ప్రకృతి ఇస్తున్నా.. కొన్ని అవసరాల కోసం వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాం. ముఖ్యంగా సామాజిక అవసరాల కోసం స్వచ్ఛమైన వాతావరణాన్ని ఇచ్చే అడవులను నరికివేస్తున్నాం. అడవులు లేకపోవడం వల్ల కర్మాగారాలు, ఇతర మార్గాల ద్వారా విడుదలయ్యే కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగి మనుషుల ప్రాణాల ముప్పుకు వస్తోంది. ఒక్కోసారి ఈ కర్భన ఉద్ఘారాల వల్ల అడవుల్లోనూ కార్చిచ్చు మొదలై వాటి నుంచి ప్రాణాంతక వాయువులు వెలువడుతున్నాయి. వీటితో మానవాళి మనుగడకు పెద్ద ప్రమాదంలా మారే అవకాశం ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద 10 అభయారణ్యాల నుంచి కర్భన ఉద్గారాలు అత్యధిక మోతాదులో వెలువడుతున్నట్లు అభయారణ్యాలపై నిర్వహించిన సర్వేలో తేలింది. భూమ్మీద ఉష్ణోగ్రత పెరిగినందునే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 27 సాంస్కృతిక అభయారణ్యాలున్నాయి. వాటి నుంచి 19 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ప్రతీ సంవత్సరం ఇంధన వాయువులు విడుదల చేస్తున్న వాటిలో ఇది సగం అని యునెస్కోకు చెందిన ప్రతినిధులు పేర్కొంటున్నారు. వాతావరణ మార్పులను అరికట్టడంతో అడవులు పాత్ర కీలకమైనది. కానీ వాతావరణంలో కాలుష్య ప్రభావం వల్ల అడవులు తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొని ఇవి కర్భన ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు వారు అభిప్రాయ పడుతున్నారు.
అమెరికా, ఆస్ట్రేలియాలోని అడవుల్లో ఇటీవల కార్చిచ్చులు సంభవించిన విషయం తెలిసిందే. ఇవి కొన్ని మిలియన్ టన్నుల కార్బన్ డై యాక్సైడ్ ను విడుదల చేశాయి. ఇప్టటి వరకు జరిగిన కార్చిచ్చుల్లో కంటే ఇది అత్యధికం అని యునెస్కో పేర్కొంది. కర్భన ఉద్గారాలు పెరుగుతున్నాయంటే.. కార్చిచ్చులు కూడా పెరుగ తున్నట్లేనని అనుకోవాలని పరిశోధకులు అంటున్నారు. 2001-2020 సంవత్సరాల మధ్య శాటిలైట్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విడుదల చేశారు. వారు తెలిపిన దాని ప్రకారం.. హరిత వనాలు, చెట్లు, ఎంత ఒత్తిడిని భరిస్తున్నాయో వారు వెల్లడించారు.
కానీ ఇంకా అంతకంటే ఎక్కువే ఒత్తిడి కలిగి ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వ్యవసాయం కోసం, ఇతర అవసరాల కోసం అడవులను నరికివేయడం వల్ల మరింత ప్రమాదస్థితికి మారే అవకాశం రానుంది. అడవులను నరికివేయడం వల్ల వాటికున్న సహజ విలువలను అవి కోల్పోతాయి. ఈ ప్రభావం మిగతా అడవులపై పడి వాటిల్లో కార్చిచ్చులు ఏర్పడే అవకాశం ఉంది.
సహజ శైలికి భిన్నంగా కర్మగారాలు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడంతో పాటు పట్టణాల్లో చెట్లను పెంచకపోవడంపై భూమిపై ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. దీని వల్ల వర్షాలు పడకపోవడం క్రమంగా వాతావరణంలో అనేక మార్పులతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడనుంది. ఇలా ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం వల్ల అడవుల్లోను చల్లటి వాతావరణం దెబ్బతింటుంది. ఆ సమయంలో దట్టమైన అడవుల్లో సైతం ప్రశాంత వాతావరణం చెదిరి కార్చిచ్చులు ఏర్పడే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితి మరింత తీవ్ర కాకుండా ఉండేందుకు మానవ జీవన శైలిలో మార్పులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2017లో డొమినికాలో మరియా హరికేన్ సంభవించినప్పుడు మోర్న్ ట్రోయిస్ పిటోన్స్ జాతీయ పార్క్ లో 20 శాతం ప్రాంతం నాశనం అయింది. ప్రపంచంలోని దట్టమైన అడవుల్లో కూడా వాతావరణ సంక్షోభం ఏర్పడుతోంది. అయితే కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నం మొదలుపెడితే ఇలాంటి ప్రమాదాలను తప్పించుకోవచ్చు. అయితే ఆ పని ఏ ఒక్కోచోటో, ఒక్క ప్రాంతంలో చేస్తే సరిపోదు. ప్రపంచ దేశాలన్నీ ఒక్క తాటిపైకి ఉద్గారాలను తగ్గించే మార్గం చూడాలి. అప్పుడే మనం అడవును కాపాడుకోవచ్చు.