Homeఅంతర్జాతీయంQueen Elizabeth: క్వీన్ ఎలిజిబెత్ అస్తమయం.. అమల్లోకి ఆపరేషన్ యూనికార్న్‌.. ఈ ఆపరేషన్ ఏంటి?

Queen Elizabeth: క్వీన్ ఎలిజిబెత్ అస్తమయం.. అమల్లోకి ఆపరేషన్ యూనికార్న్‌.. ఈ ఆపరేషన్ ఏంటి?

Queen Elizabeth: బ్రిటన్ లో రాజవంశం అంటే అక్కడి ప్రజలకు వల్లమానిన అభిమానం. రాజవంశానికి సంబంధించి ఏ చిన్నపాటి వార్త అయినా అక్కడ ప్రాధాన్యతాంశమే. అటువంటిది దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన రాణిగా ఎలిజిబెత్ 2 ప్రపంచానికి సుపరిచితురాలు. ఆమె మరణాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అత్యధిక కాలం పాలించిన రాణిగా ఆమె 2015లోనే రికార్డును సొంతం చేసుకున్నారు. గురువారం ఆమె మరణించే సమయానికి ఆమె 70 ఏళ్ల ఏడు నెలల పాటు దేశాన్ని పాలించారు. తన హాయాంలో దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ 4 వేలకు పైగా చట్టాలకు ఆమోదముద్ర వేయడం మరో విశేషం. ఎలిజిబెత్ 2 మరణంతో సింహాసనాన్ని ఆమె కుమారుడు, వేల్స్ మాజీ ప్రిన్స్ చార్లెస్ అధిష్టించనున్నారు. అయితే రాణిగారి అంతిమ శ్వాస నుంచి అధికారిక సమాధి చేసే వరకూ కార్యక్రమాలను ఒక యాగంలా నిర్వహిస్తారు. మహారాణి ఎలిజిబెత్ 1 మరణానంతర కార్యక్రమ వివరాలు శుక్రవారం లీకయ్యాయి. రాణి మరణించిన వెంటనే ఆరంభమయ్యే కార్యకలాపాలను ఆపరేషన్ లండన్ బ్రిడ్జిగా పిలుస్తారని పొలిటికో వార్తా సంస్థ ప్రకటించింది. రాణి మరణించిన రోజును అధికారికంగా డీడే గా పిలుస్తారు.. సెలవు ప్రకటిస్తారు.

Queen Elizabeth
Queen Elizabeth

రాణి మరణానంతరం ఆపరేషన్ యూనీకార్న్ ప్రారంభమైనట్టు పొలిటికో వార్త సంస్థ బయటకు వెల్లడించింది. రాణి ఎలిజిబెత్ దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించారు. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆమె వయసు ప్రస్తుతం 92 సంవత్సరాలు. ఆమె తుది శ్వాస విడిచిన తరువాత పార్థివ దేహాన్ని సంతాప సూచకంగా పది రోజుల పాటు అలాగే ఉంచుతారు. ఈ పది రోజులు ఆమె వారసుడు ప్రిన్స్ చార్లెస్ దేశ వ్యాప్తంగా పర్యటించి రాణి మరణ వార్తను పౌరులకు చేరవేస్తాడు. మూడు రోజలు పాటు సందర్శకుల కోసం భౌతికకాయాన్ని బ్రిటీష్ పార్లమెంట్ లో ఉంచుతారు. లక్షలాది మంది పౌరులు వచ్చే అవకాశమున్నందున అందుకు తగ్గట్టు భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు ఆ సంస్థ చెబుతోంది. కానీ ఇవన్నీ లీకుల రూపంలో బయటకు వచ్చిన వివరాలే తప్ప.. అధికారికంగా బకింగ్ హోం ప్యాలెస్ వర్గాలు ఎటువంటి అప్ డేట్ బయటకు వెల్లడించడం లేదు.

Queen Elizabeth
Queen Elizabeth

అయితే పొలిటికో వార్త సంస్థ చెప్పినట్టు ఆపరేషన్ యూనీకార్న్ ఆంక్షలు వెలుగుచూస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత బీబీసీ యాంకర్లు నలుపు రంగు దుస్తులు ధరించారు. చానల్ రోలింగ్ రంగులు కూడా మారాయి. యూనైటెడ్ కింగ్ డమ్ జాతీయ గీతాన్ని సవరించి మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం రాణి చిత్రంతో ఉన్న యూకే కరెన్సీ నాణేలను మార్పు చేయనున్నారు. క్రమేపీ ప్రిన్స్ చార్లెస్ చిత్రాలతో భర్తీ చేయనున్నారు. రాణి మరణానంతరం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ బిలియన్ ఆదాయాన్ని కోల్పోయే అవకాశముంది. వారం రోజుల పాటు ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అటు రాణి అంత్యక్రియలకు బంకింగ్ హోం ప్యాలెస్ ఏర్పాట్లు చేస్తోంది. ఒక వేళ ఆమె లండన్ లో చనిపోయి ఉంటే మాత్రం లండన్ బ్రిడ్జి అనే నామకరణం చేసి ఉండేవారు. కానీ ఆమె వేసవి విడిదికి వెళ్లి బల్మోరల్ క్యాజిల్ లో తుది శ్వాస విడిచారు. కాగా ఎలిజిబెత్ 2 మరణంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. 2015, 2018లో ఆమెతో కలిసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. ఆమె ఎంతో ప్రేమ పంచారని చిరస్మరణీయ సమావేశాలని గుర్తుచేసుకుంటూ ట్విట్ చేశారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular