https://oktelugu.com/

హుజురాబాద్ పై కేసీఆర్ వ్యూహమేంటి?

ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమంది.దీంతో అధికార పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. నాగార్జునసాగర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికల మాదిరి వ్యూహం పన్నుతోంది. ఆదివారం నుంచే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. హుజురాబాద్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, కమలాపూర్ మండలాలతో పాటు హుజురాబాద్, జమ్మికుంట పురపాలక సంఘాలున్నాయి. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. పార్టీకి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన అనంతరం […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 5, 2021 1:02 pm
    Follow us on

    CMKCR

    ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమంది.దీంతో అధికార పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. నాగార్జునసాగర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికల మాదిరి వ్యూహం పన్నుతోంది. ఆదివారం నుంచే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
    హుజురాబాద్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, కమలాపూర్ మండలాలతో పాటు హుజురాబాద్, జమ్మికుంట పురపాలక సంఘాలున్నాయి. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. పార్టీకి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన అనంతరం సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి హరీశ్ రావు, ప్రణాళిక సంఘం ఉఫాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితర ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులతో ఫోన్ లో మాట్లాడారు.

    ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో పూర్తిస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని సీఎం నిర్ణయించారు. శాసనసభ్యత్వానికి ఈటల రాజీనామా చేసిన అనంతరం దాన్ని సభాపతి ఆమోదించిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలో ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరగాలి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అన్ని ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేస్తోంది. ఎన్నికలు ఎప్పుడైనా ఇప్పటి నుంచే వ్యూహాన్ని అమలు చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

    హుజురాబాద్ నియోజకవర్గంలో గత ఏడేళ్లో జరిగిన అభివృద్ధి వివిధ పథకాల కింద లబ్ధిదారులు తదితర అంశాలపై సమగ్ర నివేదిక రూపకల్పనకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలోని సమస్యలు పెండింగు అంశాల మీద సైతం విడి నివేదిక రూపొందించాలని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు.