Prashanth Kishor Report- Kcr: నియోజకవర్గాల్లో ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు..? ప్రభుత్వం, పార్టీపై వ్యతిరేకత ఎంత ఉంది..? పార్టీలోని నాయకులపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది..? ఇప్పుడున్నవారిలో ఎంతమంది ప్రజాదరణ పొందుతున్నారు..? ఎంత మందికి టిక్కెట్లు ఇవ్వొచ్చు..? ఎంతమందిని రిజెక్ట్ చేయొచ్చు..? ఈ అంశాలతో కూడిన సర్వే రిపోర్ట్ ను ప్రశాంత్ కిశోర్ కేసీఆర్ కు సమర్పించినట్లు సమాచారం. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిశోర్ నిన్న కేసీఆర్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఐపాక్ టీం చేసిన సర్వే వివరాలను టీఆర్ఎస్ అధినేతను అందించినట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ,ప్రభుత్వంపై నివేదిక ఇచ్చారు. దీంతో పీకే చెప్పిన ప్రకారం కేసీఆర్ నడుచుకుంటాడా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఆలోచిస్తామన్నారు. అంటే పరోక్షంగా వారికి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదన్నట్లు కామెంట్ చేశారు. అంతేకాకుండా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పిన వారికే టిక్కెట్లు ఇస్తామని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ వైపు చర్చ సాగుతుండగానే.. మరోవైపు పీకే కేసీఆర్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే కేటీఆర్ చెప్పిన విధంగానే పీకే సర్వే రిపోర్టులను అందించినట్లు తెలుస్తోంది.
Also Read: KCR National Party: కేసీఆర్ మరోసారి ‘సెంటిమెంట్’ అస్త్రం: జాతీయ పార్టీ నినాదం ఇదే..
కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లోని నేతలు వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లడంతో విఫలం చెందారు. కొందరిపై భూ కబ్జా, ఇతర ఆరోపణలు వెల్లువెత్తాయి. మరికొందరు టీఆర్ఎస్ లో ఉంటూ ఇతర పార్టీలకు విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అలాంటి వారి నేతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పీకే కేసీఆర్ కు సూచించినట్లు సమాచారం. మొత్తం 119 నియోజకవర్గాల్లో దాదాపు రెండు పర్యాయాలుగా గెలిచిన వారున్నారు. అయితే వీరంతా కేసీఆర్ మానియాతో గెలుపొందారని అంటారు. కానీ ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడ్డదారులు తొక్కడంతో సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరలేదు. దీంతో ప్రభుత్వంపై కొందరు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి టిక్కెట్లు ఇస్తే ప్రయోజనం ఉండదని పీకే సర్వే రిపోర్టులో తేలింది. ఇదే సమయంలో అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు..? వారికి ఏం కావాలి..? అనే విషయాలను కూడా కూలంకశంగా సర్వే చేసినట్లు సమాచారం. ఎక్కువగా ఉచిత పథకాలకు కాకుండా ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్నట్లు పీకే టీం గ్రహించినట్లు తెలుస్తోంది. అందువల్ల ఉద్యోగ నియామాకాల్లో పురోగతి సాధిస్తే ప్రభుత్వంపై నమ్మకం పడే అవకాశం ఉందని తెలిపినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కూడా పీకే టీం సర్వే చేసింది. గతంలో మూడెకరాల భూమి ఇస్తానన్న ప్రభుత్వం దానిని విస్మరించింది. అయితే దళితులకు ‘దళిత బంధు’ పేరిట రూ.10 లక్షల సాయం చేస్తున్నా మిగతా వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మిగతా వర్గాల వారిని సంతృప్తి పరిచేలా ప్రత్యేక పథకాలు ప్రవేశెడిటే ప్రయోజనం ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే పీకే ఇచ్చిన రిపోర్టును కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉంది. ఆయన చెప్పినట్లు నడుచుకుంటారా..? లేక ఇతర ప్రణాళిక వేస్తారా..? అనేది తేలాల్సి ఉంది.
ఇక ప్రశాంత్ కిశోర్ టీం ప్రస్తుతం ఓన్లీ టీఆర్ఎస్ కు మాత్రమే పనిచేస్తున్నారు. ఆయన శిష్యుడు జగన్ కోసం పనిచేస్తున్నారు. బీహార్ లో సొంత రాజకీయం మొదలుపెట్టిన ఆయన త్వరలో ఎన్నికల్లోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల వెనుక ఆయన వ్యూహం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చాలని పీకే సూచించినట్లు సమాచారం.
Also Read:Khammam District Politics: ఖమ్మంలో రసవత్తర రాజకీయం