KCR PM: ‘సోషల్’ ఫోకస్: కేసీఆర్ ప్రధాని అయితే ఏం చేస్తారు?

KCR PM: పిల్ల పుట్టకముందే కుల్లకుట్టిన సాత్రంగా మారింది టీఆర్ఎస్ పరిస్థితి. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గెలుస్తాడో లేదో కూడా తెలియని కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై హడావుడి చేయడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. రెండు సార్లు గెలిచిన వ్యతిరేకతను అధిగమించి మూడో సారి హ్యాట్రిక్ కొట్టడమే కేసీఆర్ ముందున్న పెద్ద టాస్క్. ఆ తర్వాతే జాతీయ రాజకీయాలు, ప్రధానమంత్రి పీఠం.. అది ఆలోచించుకుండా కేసీఆర్ డైరెక్ట్ పీఎం అయినట్టు గులాబీ శ్రేణులు సోషల్ మీడియాలో […]

Written By: NARESH, Updated On : June 13, 2022 7:46 pm
Follow us on

KCR PM: పిల్ల పుట్టకముందే కుల్లకుట్టిన సాత్రంగా మారింది టీఆర్ఎస్ పరిస్థితి. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గెలుస్తాడో లేదో కూడా తెలియని కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై హడావుడి చేయడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. రెండు సార్లు గెలిచిన వ్యతిరేకతను అధిగమించి మూడో సారి హ్యాట్రిక్ కొట్టడమే కేసీఆర్ ముందున్న పెద్ద టాస్క్. ఆ తర్వాతే జాతీయ రాజకీయాలు, ప్రధానమంత్రి పీఠం.. అది ఆలోచించుకుండా కేసీఆర్ డైరెక్ట్ పీఎం అయినట్టు గులాబీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. ఇంతకీ కేసీఆర్ ప్రధాని అయితే ఏం చేస్తాడన్నది వైరల్ చేస్తున్నాయి. ఏం చేస్తాడన్నది సోషల్ మీడియాలో ఘనంగా చెప్పుకుంటున్నారు. అవేంటో చూద్దాం..

మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి అయితే దేశం ఎలా ఉండబోతుందో  ఇలా ప్రచారం చేసుకుంటున్నారు.

1.దేశం సస్య శ్యామలం అవుతుంది
కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు దేశ వ్యాప్తంగా నిర్మిస్తారు… వృధాగా సముద్రంలో కలుస్తున్న నది జలాలను ప్రజల కోసం మల్లిస్తాడు… అలా దేశంలో నీటి సమస్యలకు చెక్ పడి అటు తాగు ఇటు సాగు సమస్యలు ఏక కాలంలో తీరి సస్య శ్యామలం అవుతుంది

2. దేశ సరిహద్దు సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి
స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ఇప్పటికి సమస్యలు ఎదురుకుంటూనే ఉన్నాం… కేసీఆర్ గారు ప్రధాని అయితే ఈ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని గట్టిగా నమ్ముతున్నాను

3.రైతుల బాధలు తీరుతాయి
దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం మినహా మిగితా రాష్ట్రాల్లోని రైతులు ఏదో రకంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు…కేసీఆర్ గారు ప్రధాని అయితే తెలంగాణ తరహా రైతు పథకాలతో దేశ రైతుల తలరాతను మారుస్తారు

4. కరెంటు తిప్పలు తప్పుతాయి
రాష్ట్రం ఏర్పడిన ఏడాది లోపే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు సమస్యలను అధికమించి కరెంటు కోతలు లేకుండా చేశారు కేసీఆర్ గారు… అలాగే దేశ విద్యుత్తు సమస్యను అధికమించి అంధకార భారత్ ను వెలుగుల భారత్ గా చేస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు

5.ధర్మ పరిరక్షణ
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హిందూ మతాన్ని ఆచారిస్తూ పరమత సహనాన్ని కలిగి ఉన్న మహా నేత…యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని ఎంతో గొప్పగా పునర్నిర్మించారు… రాష్ట్రంలోని అనేక ఆలయాల అభివృద్ధికి కట్టుబడుతూ మరో వైపు దూప దీప నైవేద్యం ద్వారా ఆలయ అర్చకులకు నెల వారి జీతం అందిస్తున్నారు… అలాగే ముస్లిం మౌలాలకు కూడా ప్రతినెలా గౌరవ వేతనం అందిస్తూ…మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వస్తున్నారు…కేసీఆర్ గారు ప్రధాని అయితే దేశంలో మత కల్లోలాలకు చోటు ఉండదు… యువత కూడా పెడ దారి పట్టదు

6. అగ్ర దేశాలతో పోటీ పడేలా అభివృద్ధి
ప్రస్తుతం మోడీ పాలనలో పొరుగున ఉన్న పాకిస్తాన్ కంటే మనమే మెరుగ్గా ఉన్నాం కదా… పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కంటే మనమే మెరుగ్గా ఉన్నాం కదా అనే ప్రచారాన్ని బీజేపీ వాళ్ళు లోతుగా తీసుకెళ్తున్నారు… మన దేశం ఎక్కడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు ఎక్కడా… మన పోటీ అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా అనే విషయాన్ని దేశ ప్రజలు మర్చిపోయే స్థితికి మన దేశాన్ని దిగదార్చారు

కేసీఆర్ ప్రధానమంత్రి అయితే తిరిగి మన దేశం అన్ని రంగాలలో వృద్ధిని సాధించి అగ్ర రాజ్యాలతో పోటీ పడే స్థాయికి ఎదుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు

మహాత్ముల ఆశీర్వాదం తో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కేసీఆర్ అవ్వాలి…దేశాన్ని తల ఎత్తుకునేలా తీర్చిదిద్దాలని టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కానీ అదంత సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలుసు. ఏదో టీఆర్ఎస్ శ్రేణుల సంతోషానికి ఇలాంటివి ఫార్వర్డ్ చేయడం తప్ప మరొకటి ఏం లేదు.