Rahul Gandhi : బంగ్లాదేశ్ గొడవలకు రాహుల్ గాంధీకి ఏంటి సంబంధం.. రిపబ్లిక్ టీవీ సంచలనాత్మక కథనం

బంగ్లాదేశ్లో ఏర్పడిన ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా తారిక్ రెహమాన్ నియమితులయ్యారు. అయితే అతడిని కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ కొద్దిరోజుల క్రితం లండన్ లో కలిసినట్టు తెలుస్తోంది.. ఇదే సమయంలో బంగ్లాదేశ్ లో నివాసం ఉంటున్న హిందువులపై దాడులు చేయాలని ప్రేరేపించినట్టు

Written By: Anabothula Bhaskar, Updated On : August 13, 2024 12:00 pm

Rahul Gandhi

Follow us on

Rahul Gandhi : మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో శాంతిభద్రతలు ఇంకా గాడిన పడలేదు. రిజర్వేషన్ల రగడతో అక్కడ మొదలైన అల్లర్లు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో అక్కడి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆర్మీ హెలికాప్టర్లో స్వదేశాన్ని వీడి భారత్ లో తల దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. యూనస్ ఆధ్వర్యంలో ఏర్పడింది తాత్కాలిక ప్రభుత్వమేనని అక్కడి అధికారులు చెబుతున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బంగ్లాదేశ్లో పరిస్థితి ఏమాత్రం చక్కబడలేదు. విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులు పరిపాటిగా మారాయి. అల్లరి మూకలు లూటీలకు పాల్పడుతున్నాయి. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడాన్ని మహమ్మద్ యూనస్ తప్పు పడుతున్నారు. ఇదే క్రమంలో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గో స్వామి సంచలనాత్మక కథనాన్ని ప్రసారం చేశారు. ఇంతకీ ఆ కథనంలో వివరాలు ఏంటంటే..

బంగ్లాదేశ్లో ఏర్పడిన ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా తారిక్ రెహమాన్ నియమితులయ్యారు. అయితే అతడిని కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ కొద్దిరోజుల క్రితం లండన్ లో కలిసినట్టు తెలుస్తోంది.. ఇదే సమయంలో బంగ్లాదేశ్ లో నివాసం ఉంటున్న హిందువులపై దాడులు చేయాలని ప్రేరేపించినట్టు.. ఆ విషయాన్ని తాను బల్లగుద్ది మరి చెప్పగలనని బంగ్లాదేశ్ లోని ప్రముఖ జర్నలిస్టు సలాలుద్దీన్ చౌధరీ వ్యాఖ్యానించాడు.. అర్ణబ్ గోస్వామి నిర్వహించిన డిబేట్ లో అతడు ఈ సంచలన విషయాలను వెల్లడించాడు. ” బంగ్లాదేశ్ లో పరిస్థితి అధ్వానంగా మారింది. దీనికి స్వదేశంలో ఉన్న నాయకులు కొంతమేర కారణమైతే.. బంగ్లాదేశ్ కు పొరుగున ఉన్న భారత్ లోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా కొంతమేర కారణం. ఇటీవల అతడు లండన్ లో పర్యటించాడు. ఆ సమయంలో బంగ్లాదేశ్ ప్రస్తుత తాత్కాలిక ప్రధాని తారీక్ రెహమాన్ ను కలిశాడు. ఇక్కడ సంఘటితంగా జీవిస్తున్న హిందువులపై దాడులకు పాల్పడాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందువల్లే ప్రస్తుతం ఈ విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని” సలాలుద్దీన్ చౌధరీ వ్యాఖ్యానించాడు..

“సలాలుద్దీన్ చౌధరీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. మొన్నటిదాకా బంగ్లాదేశ్లో అల్లర్లను కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్నప్పటికీ నోరు మెదపలేదు. ఇదే సమయంలో గాజాలో అల్లర్లు జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ నాయకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ బంగ్లాదేశ్లో హిందువులపై అల్లర్లు జరుగుతున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనిని బట్టి హిందువులపై జరుగుతున్న దాడుల వెనుక రాహుల్ గాంధీ ఉన్నాడనేది అర్థమవుతుందని.. ఇప్పటికైనా హిందువులు దీనిని అర్థం చేసుకోవాలని” బిజెపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని దెప్పిపొడుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ – తారీక్ రెహమాన్ లండన్లో కలిసిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అయితే దీనికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విఫలమవుతోంది. మరోవైపు ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెట్టిన రాహుల్ గాంధీ.. ఈ పరిణామంతో ఒక్కసారిగా డిఫెన్స్ లో పడ్డారని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.