Union Budget Of India 2022: ప్రజావసరాలు తీర్చేందుకు.. వివిధ వస్తు సేవలపై ప్రభుత్వం పన్ను విధిస్తుంది. అయితే వచ్చిన మొత్తాన్ని సబ్సిడీల రూపంలో తిరిగి పేదవారికి చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థలో కొంత అసమానతలు ఏర్పడవచ్చు. అయితే అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ.. అందరికీ సమాన ఆర్థిక అవసరాలు తీర్చే విధంగా ఏర్పాటు చేసేదే పార్లమెంట్ లో ప్రవేశపెట్టే కేంద్రప్రభుత్వ బడ్జెట్. ప్రతీ బడ్జెట్లో సామాన్యులకు మేలు చేశామని ప్రజాప్రతినిధులు చెబుతుంటారు. కానీ పరోక్షంగా వీరిలో కొందరు నష్టపోతూనే ఉంటారు. ఒక్కోసారి కొంత వరకు సబ్సిడీలు అందించినా.. పన్నులతో ప్రభత్వం పీడీస్తూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా సామాన్యులకు మేలు చేసేఅవకాశం ఉందని అంటున్నారు. అయితే అందుకు ఓ కారణం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకని రచించారని అంటున్నారు. సమాజంలో రైతులు, గ్రామీణులు, యువత, పేదలు, మహిళలు, దళితులు ఇలా అనేక వర్గాలకు చెందిన వారున్నారు. వీరితో పాటు ఓటు బ్యాంకుగా పిలిచే మరోవర్గం ఉంది. వీరిని సంతోషపెట్టడానికి ప్రభుత్వం శాయశక్తులగా కృషి చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ మరి కొద్ది రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వీటిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రూపకల్పన చేశారని అంటున్నారు.
Also Read: Union Budget Of India 2022: వేతన జీవులకు ఊరట? నేటి బడ్జెట్లో కీలక పాయింట్ ఇదే!
ఇదిలా ఉండగా సమాజంలో ప్రభుత్వానికి చాలా పెద్ద వర్గం మద్దతు ప్రభుత్వానికి అవసరమని, దానికి అనుగుణంగా వారికి పన్నుల మినహాయింపులు ఇవ్వాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గురించి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇలాంటి విపత్కర సమయంలో పన్ను మినహాయింపులు ఇవ్వడంతో ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని అంటున్నారు. ప్రభుత్వం పన్ను మినహాయింపులతో ప్రజల నుంచి విశ్వనీయత పొందుతుంది.. కానీ ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ ఉండకపోవచ్చని అంటున్నారు.
అయితే కొన్ని వర్గాలకు మినహాయింపులు ఇచ్చినా ప్రభుత్వం పన్నుల వసూళ్లలో వేగం పెంచింది. దీంతో ఆదాయంలోనూ పెరుగుదల వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గత ఆరు నెలల్లో జీఎస్టీ ద్వారానే సగటున ప్రతి నెల రూ.1.20 లక్షల కోట్లు వచ్చాయి. అంటే వ్యాపారం ఊపందుకుంటోందని తెలుస్తోందని అంటున్నారు. ఇక దేశంలో అతిపెద్ద కంపెనీలు సైతం ఆర్థికంగా పుంజుకున్నట్లు కనిపిస్తోంది. కరోనా కాలం నుంచి వారి లాభాల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల కనిపించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
కార్పొరేట్ పన్నులో 60 శాతం, ఆదాయపు పన్నులో 32 శాతం పెరుగుదల కనిపించిందని అంటున్నారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్ల మొత్తం రూ.13.5 లక్షల కోట్లని అంచనా వేస్తున్నారు. ఇది బడ్జెట్ అంచనాలో కంటనే దాదాపు 46 శాతం ఎక్కువగా భావిస్తున్నారు. కరోనా మూడ్ వేవ్ లు సంభవించినా ఓవరాల్ గా పెద్ద దెబ్బ పడినట్లు కనిపించలేదని అంటున్నారు. మరోవైపు ఈ ఏడాది రూ.34.8 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. కానీ 60 శాతం కూడా ఖర్చు చేయకపోవడతో ఆదాయంలో పెరుగుదల కనిపించిందని అంటున్నారు.
Also Read: Union Budget Of India 2022: బడ్జెట్ 2022: కరోనా వేళ ఊరటదక్కేనా? ఐటీ పరిమితి పెరిగేనా? ఊసురుమంటారా?
ప్రభుత్వం ఆర్థిక అసమానతలు లేవని చెబుతున్నప్పటికీ అభివృద్ధిలో అందరికీ సమాన వాటా రాలేదన్నది మాత్రం వాస్తవం కాదని తెలుస్తోంది. కొన్ని వర్గాలు అదేపనిగా అభివృద్ధిలో దూసుకుపోతుండగా.. మరికొన్ని వర్గాలు మాత్రం ఆర్థికంగా మరింతగా క్షీణిస్తున్నాయి. అయితే ఎదిగేవారిని కంట్రోల్ చేయకుండా, పడిపోయేవారిని ఎలా ఆదుకోవాలన్న దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే సమాజంలో ఆర్థికంగా కుంగిపోతున్న రంగాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వారి వ్యాపారాల్లో లాభాల నుంచి కొంత తీసుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు.