https://oktelugu.com/

KCR Plans: ముందస్తు ఎన్నికలా? కేటీఆర్ ను సీఎం చేయడమా? కేసీఆర్ ప్లాన్ ఏంటి?

KCR Plans: ప్రతిపక్షాలు ఊహించని.. అంతుబట్టని రాజకీయాలు చేయడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరితేరిపోయారు. ఆయన చర్యలు ఊహకు అందవు. ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. అది బయటపడి వైరల్ అవుతుంటుంది. తాజాగా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో మంత్రులతో అత్యవసర మీటింగ్ పెట్టారు. ఇక రేపు సోమవారం టీఆర్ఎస్ శాసనసభా సమావేశానికి నిర్ణయించారు. మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటి అవ్వబోతున్నారు. దీంతో కేసీఆర్ ఏదో ఒకటి చేయబోతున్నారన్న చర్చ సాగుతోంది. కేసీఆర్ పైకి కేంద్రంపై ఫైట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 20, 2022 10:39 am
    Follow us on

    KCR Plans: ప్రతిపక్షాలు ఊహించని.. అంతుబట్టని రాజకీయాలు చేయడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరితేరిపోయారు. ఆయన చర్యలు ఊహకు అందవు. ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. అది బయటపడి వైరల్ అవుతుంటుంది. తాజాగా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో మంత్రులతో అత్యవసర మీటింగ్ పెట్టారు. ఇక రేపు సోమవారం టీఆర్ఎస్ శాసనసభా సమావేశానికి నిర్ణయించారు. మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటి అవ్వబోతున్నారు. దీంతో కేసీఆర్ ఏదో ఒకటి చేయబోతున్నారన్న చర్చ సాగుతోంది.

    కేసీఆర్ పైకి కేంద్రంపై ఫైట్ అంటున్నారు. తెలంగాణ వడ్లు కొనుగోలు కోసం ఢిల్లీ వెళ్లి పోరాటం చేస్తానంటున్నారు. కానీ దాన్ని ఎవరూ నమ్మడం లేదు. సమ్ థింగ్ రాంగ్ అంటున్నారు. కేసీఆర్ ఏదో చేయబోతున్నారని అనుమానిస్తున్నారు. ఎందుకంటే 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికలను కూడా ఇలానే కేసీఆర్ ఢిల్లీ బాట పట్టి మోడీ, అమిత్ షాలను కలిసి వచ్చి సడెన్ గా ప్రకటించారు. నెలరోజుల్లోపే ఎన్నికలు పూర్తి చేశారు. కనీసం ప్రతిపక్షాలు సర్దుకోకుండా సీట్ల సర్దుబాటు కూడా లేకుండానే అంతా అయిపోయింది. అందుకే కేసీఆర్ ను ఇప్పుడు ఎవరూ నమ్మడం లేదు.

    ఇక రేపు సోమవారం కేసీఆర్ టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశానికి పిలుపునివ్వడం టీఆర్ఎస్ లో సంచలనమైంది. పైకి వడ్ల కోసం అంటున్నా.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై తన పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేస్తారని.. లేదా కేటీఆర్ ను సీఎం చేయడానికైనా ఈ మీటింగ్ పెట్టి ఉంటారన్నచర్చ సాగుతోంది.

    ప్రస్తుతం ముందస్తు ఎన్నికల మీదే అంతా చర్చ సాగుతోంది. ఆగస్టు తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి గుజరాత్ ఎన్నికలతోపాటు తెలంగాణలో ముందస్తుకు వెళతారని అందరూ అనుమానిస్తున్నారు. లేదంటే తాను వైదొలిగి కేటీఆర్ ను సీఎం చేసి ఈ రెండేళ్లు పరిపాలన అయ్యేలా చూసుకుంటారని అంటున్నారు.

    ఈ క్రమంలోనే తెలంగాణలో అసంతృప్తిగా ఉన్న వర్గాలను కేసీఆర్ కూల్ చేసేపనిలో పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగాలు లేక రగిలిపోతున్న యువతను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలకు పచ్చజెండా ఊపారు.

    కానీ ఇంకా రెండేళ్ల సమయం ఉండగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారా? అన్నది ప్రశ్న. ఇది మంత్రి కేటీఆర్ కు ఇష్టం లేదని చెబుతున్నారు. రెండు దఫాల వ్యతిరేకత టీఆర్ఎస్ ను వెంటాడుతుందని.. ఈ క్రమంలోనే ఈ రెండేళ్లు కోల్పోవడం కరెక్ట్ కాదన్న వాదన వేధిస్తోంది. అప్పటికీ పరిస్థితులను బట్టి ముందుకెళితే బెటర్ అని సూచిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తారన్నది మాత్రం అంతుబట్టడం లేదు.