KCR National Party Challenges: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారుతోంది. ఇప్పటికే చాలా మంది జాతీయ రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నించినా కుదరలేదు. దీంతో వారి ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియడం లేదు. దసరా రోజు మాత్రం పార్టీ పేరు ప్రకటించి ముందుకు వెళ్లేందుకు రెడీ అయిపోయారు. దీంతో కేసీఆర్ ముందు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

గతంలో చంద్రబాబు నాయుడు సైతం జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని భావించినా కుదరలేదు. దీంతో ఆ ప్రయత్నాలను విరమించుకుని టీడీపీ అధినేతగానే కొనసాగించేందుకు నిర్ణయించుకున్నారు. ఉత్తరాది వారు దక్షిణాది వారిని ఎప్పుడు కూడా రానిచ్చిన సందర్భాలు లేవు. గతంలో కర్ణాటక నుంచి దేవెగౌడ ప్రధానిగా చేసినా కొంతకాలమే చేశారు. ఇక మన తెలుగువాడైన పీవీ నరసింహారావు మాత్రం ఐదేళ్లు పాలించి తనకు ఎదురు లేదని నిరూపించుకున్నారు. కానీ ఇప్పటివరకు మన వారు జాతీయ రాజకీయాల్లో రాణించిన దాఖలాలు లేవు.
Also Read: KCR National Party : కొత్త పార్టీ పెట్టాలంటే కేసీఆర్ ఏమి చేయాలి?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తింపాలని చూసినా కుదరలేదు. ఈశాన్య రాష్ట్రాలకు ఆ చాన్స్ దొరకడం కూడా గగనమే. జయప్రకాశ్ నారాయణ్ కూడా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని చూసినా కుదరలేదు. ఈ క్రమంలో కేసీఆర్ ఎంత వరకు రాణిస్తారు? ఏ మేరకు విజయం సాధిస్తారు? అనే కోణంలో అందరు ఆలోచిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ కు ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో రాణించాలని చూడటం అత్యాశే అనే వాదనలు ఇప్పటికే చాలా మంది వ్యక్తం చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తన పార్టీని విస్తరిస్తున్నారు. ఇదివరకు ఢిల్లీకే పరిమితమైన ఆప్ ను పంజాబ్ కు విస్తరించి అక్కడ అధికారం చేజిక్కించుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ పరిధి దాటలేదు. దీంతో ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా? జాతీయ రాజకీయాలు కేసీఆర్ కు దగ్గరవుతాయా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సైతం జాతీయ రాజకీయాల్లో రాణించాలని చూసినా సాధ్యం కాలేదు. గతంలో అంత మంది కూడా ప్రయత్నించి విఫలమైనా ఇప్పుడు మాత్రం తాను వెనకడుగు వేసేది లేదని చెబుతూ కేసీఆర్ ముందుకు వెళ్లడం చూస్తుంటే ఆయన కల నెరవేరుతుందా? దేశ రాజకీయాల్లో రాణించి తనదైన మార్కు చూపిస్తారా? అనేది తేలాల్సి ఉంది.
Also Read: KCR Chandrababu: హాట్ రియాక్షన్: కేసీఆర్ జాతీయ పార్టీపై ఓ నవ్వు నవ్వి ఊరుకున్న చంద్రబాబు