Raghuvaran- Prudhvi Raj: నటుడు రఘువరన్ చివరి రోజులు ఎంత దారుణంగా గడిచాయో ఆయన స్నేహితుడు నటుడు పృథ్వి రాజ్ తెలిపారు. ఆయనతో తనకు చాలా సన్నిహిత సంబంధం ఉందన్న పృథ్వి… రఘువరన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పృథ్వి పెళ్లి, చెన్నకేశవ రెడ్డి వంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశారు. పెళ్లి పందిరి మూవీలో జగపతిబాబుతో పాటు సెకండ్ హీరోగా నటించారు. అప్పట్లో ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు ఉండేది. తెలుగులో ఫేడ్ అవుట్ అయ్యాక తమిళంలో సీరియల్స్ చేశారు.

నటుడు రఘువరన్ తో పృథ్వికి మంచి అనుబంధం ఉంది. రఘువరన్ అంత తక్కువ వయసులో చనిపోవడానికి చెడు అలవాట్లే అని పృథ్వి చెప్పుకొచ్చాడు. ఒక దశకు వచ్చాక ఆయన గతం కూడా మర్చిపోయాడు. గతంలో రఘువరన్ అన్న మాటలు గుర్తు చేస్తే.. అప్పుడు నేను అలా అన్నానా, నాకు అసలు గుర్తు లేదు అనేవాడు. రఘువరన్ కి తాను చేసే పాత్రల పట్ల అసహనం ఉండేది. ఎప్పుడూ హీరో తండ్రిగా విలన్ గా నటించడం నచ్చేది కాదు. ఈ విషయంలో అనేకసార్లు రఘువరన్ పృథ్వి వద్ద అసహనం వ్యక్తం చేశారట. లేడీ గెటప్ వేయడం తన డ్రీమ్ అని రఘువరన్ చెప్పేవారట.
విపరీతంగా డ్రగ్స్, ఆల్కహాల్ కి బానిసైన రఘువరన్ తక్కువ వయసులో మృతి చెందాడని పృథ్వి తెలియజేశాడు. 2008 మార్చ్ 11న రఘువరన్ చెన్నైలో మృతి చెందారు. అప్పటికి ఆయన వయసు కేవలం 49 సంవత్సరాలు. చనిపోయే సమయానికి విక్రమ్ మల్లన్న చిత్రంలో నటిస్తున్నాడు. ఆయన మరణంతో ఆశిష్ విద్యార్థిని తీసుకొని రీషూట్ చేశారు.

ఇక చాలా మందికి తెలియని విషయం క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోహిణి ఆయన భార్య. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి. అయితే 2004లో రఘువరన్-రోహిణి విడాకులు తీసుకొని విడిపోయారు. కొడుకు బాధ్యత రోహిణి తీసుకుంది. ఒంటరితనం కూడా ఆయన్ని వ్యసనపరుడు చేసింది. రఘువరన్ శివ, ప్రేమికుడు, రక్షకుడు, ఒకే ఒక్కడు, సుస్వాగతం చిత్రాల్లో చేసిన పాత్రలు ఎవరూ మరవలేరు. విలనిజానికి రఘువరన్ కొత్త భాష్యం చెప్పాడు. ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ డిఫరెంట్ గా ఉండేది.
[…] […]