West Bengal Elections Violence 2026: పశ్చిమబెంగాల్ ఐదు రాస్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కీలకం. ఇక్కడ హింస జరుగుతుంది. అత్యంత హింసాత్మక క్యాడర్ మొదట కాంగ్రెస్‌తో ఉండేది. తర్వాత కమ్యూనిస్టులకు మద్దతు ఇచ్చింది. తర్వాత తృణమూల్‌తో ఉంటుంది. మొత్తంగా నిరంకుశ రాజ్యం నడుస్తోంది. ఈసారి దానిని అడ్డుకునేందకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక బలగాలను పంపింది. 1.50 లక్షల మందిని బెంగాల్లో మోహరించింది. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ నోటిఫకేషన్ ముందే బెంగాల్‌కు చేంది. అందులో కొందరిని ఇఫ్తార్ విందులకు ఆహ్వానించడం, కానుకలు ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి. కానీ విధుల్లో ఉన్న ఏడుగురు సైనికులు ఇఫ్తార్ విందులకు హాజరై, కానుకలు స్వీకరించి అరెస్టయ్యారు. ఈ ఘటన నిష్పక్షపాత ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలను లేపుతోంది.
Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాజీ ప్రేయసి.. రీ యూనియన్ అదిరిపోయింది..
బెంగాల్ హింసా చరిత్ర..
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హింస కొత్తేమీ కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయం (1947–1977)లో హింసాత్మక క్యాడర్ మొదట కాంగ్రెస్‌కు మద్దతుగా పనిచేసింది. తర్వాత కమ్యూనిస్టు పాలన వచ్చాక.. 1977–2011 వరకు వామపక్షాలకు అండగా ఉంది. హింస మరింత సంస్థాగతమైంది. భూమి కోసం, పార్టీ ఆధిపత్యం కోసం హత్యలు సాధారణమయ్యాయి. తర్వాత టీఎంసీ హయాం (2011–ఇప్పటివరకు) మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక, హింస శిఖరాగ్రానికి చేరింది. 2021 ఎన్నికల్లో సందేశ్‌ఖలీ, 2023 పంచాయతీ ఎన్నికల్లో 15 మంది మరణాలు, 2024 ఉపఎన్నికల్లో టీఎంసీ నేతల హత్యలు ఇందుకు నిదర్శనాలు.
ఈసీ కట్టుదిట్టమైన చర్యలు..
ఈ నేపథ్యంలోనే ఈసారి ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. రికార్డు స్థాయిలో కేంద్ర బాలగాలను మోహరించింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే 1.5 లక్షల బలగాలు బెంగాల్‌కు చేరుకున్నాయి. 2,400 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు రెండు దశల్లో (ఏప్రిల్ 23, 29) ఎన్నికలకు మోహరించింది. 480 కంపెనీలు ముందస్తుగానే బెంగాల్లో విధుల్లో ఉన్నాయి. ప్రతీ సైనికుడి కదలికలను ఈజీ సీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. విధుల్లో ఉన్నవారు ఎక్కడికి వెళ్తున్నారో లాగ్‌బుక్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యే ఏడుగురు సైనికులు నిబంధనలు ఉల్లంఘించడం గమనార్హం.
ఇఫ్తార్ వివాదంకు వెళ్లి అరెస్ట..
షంషేర్ ప్రాంతంలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు సీఏపీఎఫ్‌కు చెందిన ఏడుగురు సిబ్బంది హాజరయ్యారు. రూల్స్‌కు విరుద్ధంగా వారు కానుకలు స్వీకరించారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు రాజకీయ పార్టీ విందుకు వెళ్లడం తప్పు. ఎన్నికల ప్రవర్తా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. జీపీఎస్ ట్రాకింగ్‌లో పట్టుబడ్డారు.
చర్యలు తీసుకున్న ఈసీ..
నిబంధనలకు విరుద్ధంగా ఇఫ్తార్‌కు వెళ్లిన ఏడుగురిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. పారామిలటరీ జైలుకు పంపారు. నలుగురిని సస్పెండ్ చేశారు.
మిగిలిన అధికారులపై కూడా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతోంది.
ఎన్నికల విధుల్లో కఠినంగా ఉండాలి..
ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాల సిబ్బందికి కఠినంగా ఉండాలి. ఈసీ పర్యవేక్షణలో పనిచేయాలి. కానుకలు స్వీకరించకూడదు(డబ్బు, వస్తువులు, ఆహారం). రాజకీయ పార్టీల విందులకు వెళ్లకూడదు(ఇఫ్తార్, దసరా, క్రిస్మస్ అని తేడా లేదు).స్థానికుల ఇళ్లలో ఆతిథ్యం స్వీకరించకూడదు.విధి ప్రాంతం విడిచి వెళ్లకూడదు. ప్రలోభాలకు లొంగకూడదు. ఈ నిబంధనలు నిష్పక్షపాత ఎన్నికలకు అత్యంత కీలకం.
రాజకీయ పార్టీలు కేంద్ర బలగాలను తమ వైపు తిప్పుకునేందుకు ఇఫ్తార్ వంటి మతపరమైన కార్యక్రమాలను వాడుకుంటున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సైనికులు తెలిసియో, తెలియకో నిబంధనలు ఉల్లంఘించారు. మమతా ప్రభుత్వం కేంద్ర బలగాలను మెచ్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏడుగురిపై త్వరితగతిన చర్యలు తీసుకోవడం ఈసీ నిబ్బరాన్ని చూపిస్తుంది.
బెంగాల్ ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు కేంద్ర బలగాలు కీలకం. కానీ ఆ బలగాలే నిబంధనలు ఉల్లంఘిస్తే, ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. ఇఫ్తార్ వివాదం చిన్నదే అయినా, ఇది పెద్ద సంకేతం.