Jaishankar sensational decision: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశంలో కలపాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. వాస్తవానికి అక్కడి ప్రజలు మనదేశంలో కలవాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఆ ఉద్యమాలను పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. దీంతో అక్కడి ప్రజలు రకరకాల మార్గాలలో తిరుగుబాటులను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో చాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు.. ట్రోఫీని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ప్రదర్శించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ విషయం తెలుసుకున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి.. పాకిస్తాన్ ప్రయత్నాన్ని నిలువరించగలిగింది.
వాస్తవానికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో విలువైన ఖనిజ వనరులు ఉన్నాయి. వాటిని సరైన స్థాయిలో వినియోగించుకోలేక పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన నిర్లక్ష్యాన్ని చాటుకుంటూనే వస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఇంతవరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. తాగునీటి సౌకర్యం కూడా అంతగా లేదు.. హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉంటారు కాబట్టి అక్కడి లోయల్లో ప్రవహించే నీటిని అక్కడి ప్రజలు వివిధ అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. ఇక్కడ సహజమైన ప్రకృతి ఉండడంతో పర్యాటకంగా బాగుంటుంది. కానీ ఆ ప్రాంతాలను పర్యటకంగా అభివృద్ధి చేయడంలో పాకిస్తాన్ విఫలం అవుతూనే ఉంది. ఇక ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఆందోళనలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే వాటిని బయట ప్రపంచానికి తెలియకుండా పాకిస్తాన్ ప్రభుత్వం తొక్కి పెడుతోంది.
సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంపై ఇంతవరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి ఆయన ఇటీవల కాలంలో ఆ మాటలు మాట్లాడకపోయినప్పటికీ.. భారత ప్రభుత్వ అసలు అంతరంగం అదేనని తెలుస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ మరింత విస్తరిస్తుందని.. ఆర్థికంగా మరింత సుసంపన్నం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
నిన్న భారత వాయుసేన అధిపతి పాకిస్తాన్ కు గట్టి హెచ్చరికలు పంపారు. ఆపరేషన్ సిందూర్ -2 కూడా ఉంటుందని స్పష్టం చేశారు. అప్పుడు పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలోనే ఉండదని స్పష్టం చేశారు. ఈ లెక్కన చూస్తే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదని అర్థమవుతూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దు, పెద్ద నోట్ల రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, త్రిబుల్ తలాక్ రద్దు.. జీఎస్టీ.. ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులతో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన నరేంద్ర మోడీ.. త్వరలోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
After the Army Chief, Airforce Chief, Defence Minister – another big statement :
“PoK is an integral part of India… It will return. This is our national resolve!”
— Dr. S. Jaishankar (EAM-India) pic.twitter.com/Y0bsQvxheG— Baba Banaras™ (@RealBababanaras) October 4, 2025