Russia Ukraine War: “మంచి యుద్ధం.. చెడ్డ శాంతి” అనేవి ఉండవు.. ఏదో తాత్కాలిక ఆవేశాలకు గురై యుద్ధానికి వెళ్తారు కానీ… ఆ యుద్ధం వల్ల జరిగే అనర్ధాలు అన్ని ఇన్ని కావు.. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల వల్ల ఒనగూరిన లాభం కంటే, జరిగిన నష్టమే ఎక్కువ.. సామ్రాజ్యవాద పోకడలను నర నరాన జీర్ణించుకున్న పాలకులు అంత తేలిగ్గా శాంతి వైపు మొగ్గరు. యుద్ధం అంటే వారికి ప్రీతి. జనాలు కొట్టుకు చస్తుంటే వారికి మహాదానందం.. పూర్వపు రోజుల్లో హిట్లర్ అనే నియంత ప్రపంచానికి నరకం చూపాడు.. ఇప్పుడు బయటికి కనిపించరు కానీ ప్రపంచ దేశాల్లో మెజారిటీ అధినేతలు మొత్తం హిట్లర్ వారసులే. ఈ పదం వాడేందుకు కొంచెం ఇబ్బంది అనిపించినా తప్పడం లేదు.. ఇక ఉక్రెయిన్ తో జరుపుతున్న యుద్ధాన్ని ముగించాలని రష్యా భావిస్తున్నది.. రష్యన్ గూడచారి సంస్థ ఎఫ్ఎస్ బీ ఉక్రెయిన్ నుంచి సరైన సమాచారం సేకరించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

మరోవైపు రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉక్రెయిన్ విషయంలో విఫలం అయినట్టు సమాచారం.. రష్యా తన ఎఫ్ఎస్ బి ఆపరేటర్లను ఉక్రెయిన్ లో ఎంగేజ్ చేయటంలో విఫలం అవడం వల్లే గత పది నెలలుగా ఆ దేశం మీద ఆధిపత్యం ప్రదర్శించలేకపోతోంది.. సాధారణంగా గూడచారి సంస్థలు విదేశాలలో కీలక సమాచారం కోసం వివిధ రూపాల్లో తమ ఏజెంట్లను నియమించుకుంటాయి.. ఇక గూడచర్యం అనేది ఎప్పుడూ డబ్బుతో ముడిపడి ఉంటుంది.. ముఖ్యంగా డాలర్లు లేదా బంగారం లేదా డ్రగ్స్ ఇచ్చి ఏజెంట్లు తమ పని చక్కబెట్టుకుంటారు. అక్కడిదాకా ఎందుకు సిఐఏ ఆపరేషన్స్ లో భాగంగా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ దేశంలో అయినా తన ఏజెంట్లు దొరికిపోతే అమెరికా వెంటనే విడిచిపించుకుంటుంది. సాధారణంగా సీక్రెట్ ఏజెంట్లను పెద్ద వ్యాపారవేత్తగా ప్రొజెక్ట్ చేసి వాడుకుంటాయి.. కానీ ఏదో ఒక సందర్భంలో ఎక్కడన్నా దొరికిపోతే వాళ్లని డ్రగ్ సరఫరా చేస్తూ పట్టుబడ్డట్టుగా నటింపజేస్తాయి. ఒకవేళ ఆ దేశ అధికారులు డబ్బుకి ఆశపడేవాళ్ళు అయితే వాళ్ల అడిగినంత డబ్బుని డాలర్ల రూపంలో ఇచ్చి విడిపించుకుంటాయి. ఇక పోలీసులకు దొరికిపోయిన తమ ఏజెంట్ నేరుగా విమానం ద్వారా ఆ దేశం దాటలేడు..ఎందుకంటే పాస్ పోర్ట్ సీజ్ అయి ఉంటుంది కాబట్టి. ఇలాంటి సందర్భాల్లో సిఐఏ డ్రగ్ మాఫియాను వాడుకుంటుంది.. వారు అతడిని సముద్రమార్గం ద్వారా వివిధ రూపాల్లో స్వదేశానికి తరలిస్తారు. 2001 నుంచి 2021 వరకు నాటో దేశాల సైనికులు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నప్పటికీ ఏనాడు కూడా తాలిబన్లు పండించే గంజాయి పంట జోలికి వెళ్లలేదు. అంటే వారి అవసరం ఉన్నది కనుక.
డాలర్ డిమాండ్ ఉంది కాబట్టి…
ప్రస్తుతం ఉక్రెయిన్ కరెన్సీ కి పెద్దగా విలువ లేదు.. పైగా ఆ దేశంలో జరుగుతున్న వివిధ వ్యవహారాలపై సమాచారం సేకరించడంలో రష్యన్ గూడచార సంస్థ విఫలమైంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో డాలర్లు ఆఫర్ చేసి సమాచారం సేకరించేంత సత్తా ఆ సంస్థ వద్ద లేదు.. ఎందుకంటే తగినన్ని డాలర్లు సంస్థ వద్ద లేవు కాబట్టి.. ఇక ఉక్రెయిన్ నుంచి వివిధ దేశాలకి యుద్ధం వల్ల వలస వెళ్లిన వారి సంఖ్య దాదాపుగా 78 లక్షలు.. వీరిలో 27.5 0 లక్షల మంది రష్యాలోకి శరణార్థులుగా వెళ్లారు. వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. సోవియట్ యూనియన్ కాలం నుంచే ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి.. కాబట్టి రెండు దేశాల ప్రజలకి దగ్గరి బంధువులు కూడా ఉన్నారు.. అందుకే ఉక్రెయిన్ ప్రజలను తమ దేశంలోకి వచ్చేందుకు పుతిన్ అనుమతి ఇచ్చాడు. పైగా వాళ్లంతా కూడా రష్యన్ భాష మాట్లాడగలరు.
అప్పట్లో యాక్టివ్ గా ఉంది
1995 వరకు కూడా రష్యన్ గూడచారి సంస్థ చాలా యాక్టివ్ గా ఉండేది.. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఎఫ్ఎస్ బీ గా తన పేరు మార్చుకున్నది. అప్పటినుంచి పుతిన్ దానిమీద అధికారం చెలాయించేవాడు.. కానీ సంస్థ కు తగినన్ని నిధులు కేటాయించలేకపోయేవాడు.. దీనికి కారణం తెలియదు కానీ తర్వాత సంస్థ క్రమక్రమంగా తన అస్తిత్వాన్ని కోల్పోవడం ప్రారంభించింది.. ఇప్పుడు ఆ ప్రభావం ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రస్ఫుటంగా కనిపించింది.

అంత అభివృద్ధి లేదు
యూరప్, అమెరికా మాదిరి రష్యాలో ఎలక్ట్రానిక్స్ రంగం అంతగా అభివృద్ధి చెందలేదు.. ఈ విషయంలో చైనా కంటే కూడా రష్యా వెనుకబడి ఉంది.. కమ్యూనికేషన్ వ్యవస్థను అడ్డుకొని సంభాషణలు వినే అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ విభాగంలో చైనా, అమెరికా ముందున్నాయి.. తరచూ రష్యన్ కమాండర్లు ఉక్రెయిన్ లోని యుద్ధ సమాచారాన్ని రష్యాలో ఉన్న సెంట్రల్ కమాండ్ కి చేరవేసే క్రమంలో ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అమెరికా సహాయంతో అడ్డుకొనేది. సైనిక వ్యూహాలను తెలుసుకునేది.. దీనివల్ల రష్యా తరచూ దెబ్బతింటూ వచ్చింది.. ఇలాంటి ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంలో ఇజ్రాయిల్ దేశానిది పై చేయిగా ఉంటుంది. కానీ యుద్ధ సమయంలో ఆ దేశాన్ని సంప్రదించకపోవడం పుతిన్ చేసిన అతి పెద్ద తప్పు. మరోవైపు రష్యన్ గూడచారులకు ఉక్రెయిన్ తరఫున అమెరికా లంచాలు ఇవ్వడంతో వారు అటువైపు మొగ్గారు.. దీంతో పుతిన్ కు ఏం చేయాలో అర్థం కాక ఏకంగా యుద్ధానికే ముగింపు పలికే స్థితికి వచ్చాడు. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ ఇప్పట్లో కోలుకోదు. రష్యా తల ఎత్తి ప్రపంచానికి ముఖం చూపించలేదు.. ఎందుకంటే ఈ రెండు దేశాలకు యుద్ధం నేర్పిన పాఠాలు అటువంటివి.