కేసీఆర్ తో ఫైట్ కు రెడీ అయిన జగన్?

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్రం మాత్రం ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషిస్తూనే ఉంది. నేటికి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇరురాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన కేంద్రం సైతం రాజకీయాలకు పాల్పడుతూ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్న ఆవేదన రాజకీయవర్గాల్లో నెలకొంది. కేంద్రం మౌనముద్రతో నీటి సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారుతోంది. Also Read: హేమంత్ హత్య.. వెలుగు చూస్తున్న […]

Written By: NARESH, Updated On : October 3, 2020 11:03 am
Follow us on

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్రం మాత్రం ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషిస్తూనే ఉంది. నేటికి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇరురాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన కేంద్రం సైతం రాజకీయాలకు పాల్పడుతూ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్న ఆవేదన రాజకీయవర్గాల్లో నెలకొంది. కేంద్రం మౌనముద్రతో నీటి సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారుతోంది.

Also Read: హేమంత్ హత్య.. వెలుగు చూస్తున్న సంచలన నిజాలు..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి కంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాకే ఇరురాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయనేది వాస్తవం. ఈ సమయంలో కృష్ణా జలాల వివాదం ఇరురాష్ట్రాల సీఎంల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. ఇరుప్రాంతాల ముఖ్యమంత్రులు తమ ప్రాంత ప్రయోజనాలకు కట్టుబడి ఉండటంతో జలవివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. అగ్నికి అజ్యం పోసినట్లుగా కేంద్రం ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు యత్నిస్తుండటం శోచనీయంగా మారింది.

నిన్న కేసీఆర్ కూడా తెలంగాణ నీటి వాటా-అపెక్స్ కౌన్సిల్ భేటిపై అధికారులతో సమీక్షించారు. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని నినదించాలని.. ఈ మేరకు ఘాటు లేఖ కూడా కేంద్రానికి రాశారు. తెలంగాణకు అన్యాయం జరిగితే దేవుడినైనా ఎదురిస్తానని అన్నారు.

Also Read: సుశాంత్ చనిపోయే ముందు వరకు రియాతోనే ఉన్నాడా?

ఇక నీళ్ల పంచాయితీపై ఏపీ సీఎం జగన్ సైతం ఘాటుగా స్పందించారు. ఈ నెల 6న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ఆధ్వర్యంలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గట్టిగానే స్పందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ, తెలంగాణ మధ్య నీటి కేటాయింపులు, ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాలపై ఈ భేటిలో చర్చింనున్నారు.

తెలంగాణ లేవనెత్తే అంశాలపై ధీటుగానే బదులివ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రజంటేషన్ సిద్ధం చేయాలని.. తెలంగాణ నీటి వాడకంపై కేంద్రానికి పవర్ పాయింట్ ఇవ్వాలని జగన్ ఆదేశించారు. ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఎవరి వాదన నెగ్గుతుంది.? ఎవరు నిలబడుతారనేది ఆసక్తిగా మారింది.