ప్రజలకు హెచ్చరిక: ఆగస్టులో థర్డ్ వేవ్ కంపల్సరీ

కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉంది. థర్డ్ వేవ్ పై రోజుకో విషయం వెలుగుచూస్తోంది. తాజాగా ఐసీఎంఆర్ శాస్ర్తవేత్త దీనిపై స్పష్టత ఇచ్చారు. మూడో వేవ్ ఆగస్టులో వస్తుందని పేర్కొన్నారు. రోజుకు లక్ష కేసుల చొప్పున నమోదవుతాయని ప్రొఫెసర్ సమిరన్ చెప్పారు. పరిస్థితి మాత్రం మొదటి దశ మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. తర్వాత పరిస్థితి మారే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఐసీఎంఆర్ ఎపిడెమోలాజీ, సంక్రమణ వ్యాధుల విబాగానికి పాండా అధిపతిగా ఉన్నారు. సిచుయేషన్ ఎలా దిగజారుతుందని […]

Written By: Srinivas, Updated On : July 17, 2021 3:11 pm
Follow us on

కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉంది. థర్డ్ వేవ్ పై రోజుకో విషయం వెలుగుచూస్తోంది. తాజాగా ఐసీఎంఆర్ శాస్ర్తవేత్త దీనిపై స్పష్టత ఇచ్చారు. మూడో వేవ్ ఆగస్టులో వస్తుందని పేర్కొన్నారు. రోజుకు లక్ష కేసుల చొప్పున నమోదవుతాయని ప్రొఫెసర్ సమిరన్ చెప్పారు. పరిస్థితి మాత్రం మొదటి దశ మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. తర్వాత పరిస్థితి మారే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

ఐసీఎంఆర్ ఎపిడెమోలాజీ, సంక్రమణ వ్యాధుల విబాగానికి పాండా అధిపతిగా ఉన్నారు. సిచుయేషన్ ఎలా దిగజారుతుందని ప్రశ్నిస్తే ఐసీఎంఆర్, లండన్ ఇంపిరీయల్ కాలేజీ చేసిన పరిశోధనను వివరించారు తక్కువగా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కూడా కేసులు పెరగవచ్చు. కానీ సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చు అని తెలిపారు. కరోనా నుంచి తప్పించుకోవడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

సామూహిక సమావేశాల నిర్వహించరాదని సూచించారు. మాస్కులు ధరించకపోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ మందగించిందని అన్నారు. దీంతో కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పారు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావాలని ఆకాంక్షించారు. పర్యాటకులకు అనుమతి ఇవ్వకూడదన్నారు.

ఇతర ప్రాంతాలకు జనం చేరడంతో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. డెల్టా వేరియంట్ ద్వారా 85 శాతం మందికి ఇన్ ఫెక్షన్ వస్తుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత కేవలం 9.8 శాతం మందికి మాత్రమే కేసులు వచ్చాయి అలాగే 0.4 శాతం మాత్రమే మరణాలు సంభవించాయని గుర్తు చేశారు. మూడో దశ ముప్పును తప్పించుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.