PM Modi- Qatar FIFA World Cup 2022: మీకు గుర్తుందా.. సరిగ్గా నాలుగు నెలల క్రితం… మహమ్మద్ ప్రవక్త మీద నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఎంత కలకలం సృష్టించాయో.. కానీ అదే సమయంలో అప్పటి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతార్ దేశ పర్యటనలో ఉన్నారు. దౌత్య విధానానికి వ్యతిరేకంగా ఖతార్ నిరసన తెలిపింది. గూడచర్యం ఆరోపణలతో ఎనిమిది మంది భారతీయులను అరెస్టు చేసి భారత్ కు షాక్ ఇచ్చింది. ఈ సెగ ప్రధానమంత్రి మోడీ కూడా తాకింది.. మిగతా విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ దౌత్య విధానంలో మోడీ చాలా నిక్కచ్చిగా ఉంటాడు. దీనికి తోడు అతడి ఫారిన్ టీం సరే సరి. వెంటనే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ రంగంలోకి దిగాడు. అప్పుడు మొదలైంది అసలు ఆట.

ఖాతార్ దేశాన్ని ఒంటరి చేశారు
ఖతార్ జనాభాపరంగా చూస్తే తెలంగాణలోని గద్వాల జిల్లా అంత ఉంటుంది. భౌగోళికంగా తూర్పుగోదావరి జిల్లా అంత ఉంటుంది. కానీ ఎప్పుడైతే భారత ఉపరాష్ట్రపతి పర్యటనకు ముందే నిరసన తెలిపిందో.. అప్పుడే ఈ విషయాన్ని మోదీ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఆ దేశం నుంచి మనకు వచ్చే చమురు ఎంత ముఖ్యమో.. మన దేశం నుంచి వెళ్లే గోధుమలు కూడా వారికి అంతే ముఖ్యం. పైగా ఉక్రెయిన్ తో యుద్ధం వల్ల మన కరెన్సీ లోనే రష్యా చమురు విక్రయించింది. ప్రపంచంతో పోలిస్తే అరబ్ దేశాల నుంచి కొనుగోలు చేసే అతిపెద్ద వినియోగదారు భారత్. అమెరికా లాంటి దేశాలు కొనుగోలు చేసినా ఆ దేశాల మీద దండెత్తి నాశనం చేయాలనే బుద్ధి ఆ శ్వేత దేశానిది. ఇరాన్, ఇరాక్ తో యుద్ధాలు అందుకోసమే కదా చేసింది. ఈ పరిణామాలు అరబ్ దేశాలకు తెలియనివి కాదు. అందుకే నుపూర్ శర్మ వ్యాఖ్యల విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాయి. ఈ దేశంలోనే ఒక సెక్షన్ మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో మోదీ ఆ దేశాలకు సరఫరా చేసే గోధుమల విషయంలో నియంత్రణ పాటించాడు. ఆగమేఘాల మీద ఎగుమతులు చేయొద్దని ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ఖతార్ వంటి దేశాలకు సినిమా అర్థమైంది.

ఫిఫా వరల్డ్ కప్ కు ఆహ్వానం
నుపూర్ శర్మ వ్యాఖ్యల తర్వాత మోడీ ఉక్కపోతకు గురి చేయడంతో ఖతార్ దేశానికి ఏం చేయాలో పాలు పోలేదు. పైగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంతో ఖతార్ సహజవాయువు గిరాకీ తగ్గింది. అమెరికా వంటి దేశం దగ్గరికి వచ్చినా ఖతార్ భయపడింది. ఎందుకంటే అమెరికా ఎటువంటిదో ఆ దేశానికి బాగా తెలుసు. దీంతో భారతదేశంతో మైత్రి కోరుకునేందుకు వెంటనే ఖతార్ రంగంలోకి దిగింది.. ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కావడంతో భారత ఉప రాష్ట్రపతి జగదీప్ కు ఆహ్వానం అందించింది. దీంతో ఆయన కూడా నిన్న జరిగిన వేడుకలకు వెళ్లారు. అంతకుముందే సౌదీ దేశం భారత్ నుంచి వచ్చే వారికి ఎటువంటి పోలీస్ తనిఖీలు ఉండకుండా చూస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఖతార్ కూడా మేల్కొని భారత్ శరణుజొచ్చింది. అయితే ఖతార్ దేశంలో వరల్డ్ కప్ స్టేడియాల నిర్మాణాల్లో నిబంధనలు పాటించకపోవడంతో 600 మంది కార్మికులు చనిపోయారు. దీనిపై ఫిఫా ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే రేపటి నాడు తమ దేశంలో పని చేసేందుకు ఎవరు ముందుకు రారని ఖతార్ అర్థం చేసుకుంది. ఫిఫా వరల్డ్ కప్ ను అడ్డం పెట్టుకొని భారతదేశానికి ఆహ్వానం పలికింది. అయితే ఇదే సమయంలో వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ ను కూడా ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిని అధికారికంగా ఖతార్ ధ్రువీకరించలేదు.